సోనుసూద్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సోనుసూద్ కి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

చాలామంది సోనుసూద్ ని ఒక అభిమాని హీరోగా కాకుండా ఒక దేవుడిగా కొలుస్తున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో లక్షలాదిమందిని వారి స్వస్థలాలకు చేర్చి కలియుగ కర్ణుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి.

కరోనా మహమ్మారి సమయంలో సోనుసూద్ పేరు ఏ రేంజ్ లో మారుమోగిందో మనందరికీ తెలిసిందే. ఇంతటితో ఆపకుండా ఇప్పటికీ సమాజసేవలో మునిగితేలుతున్నారు సోనుసూద్. సహాయం అని నోరు తెరిచిన అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. సినిమాలలో విలన్ పాత్రలు పోషించినప్పటికీ నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఇప్పటికే లెక్క లేనన్ని సహాయాలు చేసిన సోను సూద్ తాజాగా నిరుపేదల పిల్లల కోసం మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని నిర్ణయించుకున్నారు.బీహార్ లోని కతిహార్ ప్రాంతానికి చెందిన ఒక ఇంజనీర్ తన ఉద్యోగాన్ని విడిచి సోనుసూద్ పేరుతో ఒక పాఠశాలను నిర్మించి 110మంది అనాథ పిల్లలకు విద్యని అందిస్తున్నారు. ఆ విషయం తెలుసుకున్న సోనుసూద్ ఇంజనీర్ ను కలిసి ప్రశంసించారు. అక్కడ విద్యతో పాటు విద్యార్థులకు ఆహారం, షెల్టర్లు ఉండం చూసి సోనూసూద్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఎక్కువ మంది పిల్లలకు లబ్ధి కలిగేలా మరో బిల్డింగ్ ను ఏర్పాటు చేయాలని సోనూసూద్ సంకల్పించారు. అనాథ పిల్లలకు అత్యుత్తమ విద్యనందించడానికి ఏకంగా ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. పేదరికాన్ని రూపుమాపడానికి చదువు ఒక్కటే మార్గమని, నిరుపేద పిల్లలకు విద్యను అందిస్తే వారు ఉన్నత స్థితికి చేరుకుంటారని తెలిపారు. కాగా ఇప్పటికే సోనుసూద్ దేశంలోని సుమారు పదివేల మంది పేద విద్యార్థులకు విద్యనందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఆయన సేవలకు గుర్తుగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో సోనుసూద్ విగ్రహాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: