అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ హీరోగా నిలబడాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పటికి కూడ సక్సస్ ఫుల్ హీరోగా నిలబడలేక పోతున్నాడు. అయినప్పటికీ ఈ అల్లు వారి అబ్బాయి తన ప్రయత్నాలు విరమించుకోవడంలేదు. లేటెస్ట్ గా అతడు నటిస్తున్న ‘బుడ్డి’ మూవీ ఫస్ట్ లుక్ పోష్టర్ ను చూసి శిరీష్ మరొక ప్రమోగం చేస్తున్నాడని అందరి తెలిసిపోయేలా నిర్ధారణ అయింది.


షామ్ అంటోన్ అనే యంగ్ తమిళ దర్శకుడు చెప్పిన డిఫరెంట్ కథ శిరీష్ కు నచ్చడంతో ఈ మూవీని శిరీష్ తన హోమ్ బ్యానర్ లో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ చాలావరకు పూర్తి కావడంతో ఈమూవీని త్వరలో విడుదల చేసే ఉద్దేశ్యంలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈమూవీ ఫస్ట్ లుక్  పోష్టర్ విడుదలైన కొద్దిసేపటికే ఈమూవీ ఒక తమిళ సినిమాకు రీమేక్ అంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది.


తమిళ హీరో ఆర్యా నటించిన ‘టెడ్డీ’ మూవీకి ఇది రీమేక్ అంటూ ప్రచారం మొదలైంది. అయితే ఈవార్తలు శిరీష్ దృష్టి వరకు వెళ్ళడంతో అతడు వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టాడు. చాలామంది అనుకుంటున్నట్లుగా ఈమూవీ ఏసినిమాకు రీమేక్ కాదని ఒక డిఫరెంట్ జోనర్ తో నేటితరం ప్రేక్షకులు కోరుకునే ట్విస్ట్ లతో ఈమూవీ కథ ఉంటుందని లీకులు ఇస్తున్నాడు.

వాస్తవానికి శిరీష్ నటించే సినిమా కథలు అన్నీ చాల డిఫరెంట్ గా ఉంటాయి.


నటుడుగా కూడ అతడికి ఒక మోస్తరు మార్కులు పడుతున్నప్పటికీ తన సినిమా ధియేటర్లకు ప్రేక్షకులను రప్పించుకునే విషయంలో విఫలం అవుతున్నాడు. ఆమధ్య అతడు అనూ ఇమాన్యువల్ కలిసి నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీకి విమర్శకుల ప్రశంసలతో పాటు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆసినిమా నిలబడలేకపోవడం ఎవరికీ అర్థంకాని విషయం. ఈ ‘బుడ్డీ’ తో అయినా శిరీష్ సాలిడ్ హిట్ కొట్టగలిగితే అతడి దశ మారే అవకాశం ఉంది..  మరింత సమాచారం తెలుసుకోండి: