
ముంబైలో కాస్ట్ లీ ఏరియాలో టీ సీరీస్ నిర్మాణ సంస్థ పక్కనే ఊరవశి ఈ ఇల్లు కొనుక్కున్నదట. అయితే అమ్మడికి అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది అంటూ హడావిడి చేయడం మొదలు పెట్టారు. బాలీవుడ్ లో కూడా ఏదో అర కొర అవకాశాలతో కెరీర్ వెళ్లదీస్తున్న ఊర్వశికి అంత డబ్బు పెట్టి ఇల్లు కొనేంత సీన్ ఎక్కడిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 190 కోట్లతో ఇల్లు అంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కూడా చేయలేనిది ఊర్వశి చేసిందంటూ చెప్పుకుంటున్నారు.
అయితే కొందరు మాత్రం ఊర్వశి ఆ విల్లాని సొంత డబ్బుతో కొనలేదని ఎవరో ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చారని అంటున్నారు. ఎంత గిఫ్ట్ అయినా అంత కాస్ట్ లీనా అంటూ నోరెళ్ల పెడుతున్నారు. ఊర్వశి రౌతెలా బాలీవుడ్ అందాల భామ తన అందాలతో ఆడియన్స్ ని మాత్రమే కాదు బాలీవుడ్ వాళ్లని కూడా తన మాయలో పడేలా చేస్తుంది. ఈ క్రమంలో అమ్మడు సడెన్ గా 190 కోట్ల ఇల్లు కొనగానే ఆమెకు ఎవరో ఇది కానుకగా ఇచ్చి ఉంటారని వార్తలు రాస్తున్నారు. అయితే ఊర్వశి మాత్రం అది తన కష్టార్జితం అంటూ చెప్పుకొస్తుంది. ఊర్వశి రౌతెలా నిజంగానే అంత రిచ్చా.. ఆమె సొంత డబ్బుతోనే ఆ విల్లాని కొనేసిందా లాంటి విషయాల మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా అమ్మడు ఎలాగోలా వార్తల్లో నిలుస్తూ క్రేజ్ తెచ్చుకుంటుంది.