
నేడు నిఖిల్ బర్త్ డే సందర్భంగా నిఖిల్ 20 వ చిత్రాన్ని మేకర్స్ ప్రకటించారు. మొట్టమొదటిసారి నిఖిల్ పీరియాడికల్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ ప్రకటించారు. స్వయంభు అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పిక్సల్ స్టూడియోస్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు కెజిఎఫ్ కు మ్యూజిక్ అందించిన రవి బసూర్ సంగీతం అందిస్తుండడం విశేషం. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో నిఖిల్ యుద్ధ రంగంలో నిలబడి పోరాటం చేస్తున్న యుద్ధవీరుడులా కనిపించాడు. చేతిలో బళ్లెం, బడిసా పట్టుకొని సీరియస్ లుక్ లో కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాలతో నిఖిల్ తన పాన్ ఇండియా ఇమేజ్ ను నిలబెట్టుకుంటాడా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.