పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయింది ఈ అందాల తార. ఈ సినిమాలోని తన అందంతో కుర్రకారులను పిచ్చెక్కించింది రకుల్ ప్రీత్ సింగ్.పంజాబీ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. తెలుగులోనే కాకుండా ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించడం లేదు. దానికి ఒక ప్రధాన కారణం కూడా ఉందని అంటున్నారు. 

అయితే రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నాని అనే బాలీవుడ్ నిర్మాతతో ప్రేమలో ఉందన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ కారణంగానే రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ బిజీగా ఉంది .అక్కడ బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ తెలుగులో వచ్చిన క్రేజ్ ని మాత్రం బీట్ చేయలేకపోతోంది రకుల్ ప్రీత్ సింగ్.ఆమె బాలీవుడ్లో సినిమాల్లో నటించినప్పటికీ అంతగా హిట్ కాలేదు. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భాగ్నానితో త్వరలోనే పెళ్లి పీటలేక పోతుంది అన్న వార్తలు సైతం వినపడుతున్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ నేను హీరోయిన్ అవ్వకుంటే కచ్చితంగా ఎంబీఏ ఫ్యాషన్ చేసే దాన్ని. నాకు 18 సంవత్సరాలు వయసులోనే సినిమాలు నటించే అవకాశం నాకు దక్కింది. మాది ఆర్మీ ఫ్యామిలీ కాబట్టి చిన్నప్పటినుండి నన్ను చాలా డిసిప్లిన్ గా పెంచారు. ఇలాగైనా సరే హీరోయిన్ అవ్వాలి అనుకుంటే ముందుగా మోడలింగ్ చేయాలి. ఎందుకంటే సొంతంగా ఎవరికి అవకాశాలు రావు .మోడలింగ్ చేస్తే అయినా మనకు కాస్త గుర్తింపు వస్తుంది .అంతే కాదు మిస్ ఇండియా వంటి కాంపిటీషన్లలో సైతం పాల్గొనాలి. ఇలా అయితేనే సినిమాల్లో అవకాశాలు తొందరగా వస్తాయి. అంటూ కొన్ని సంచలమైన విషయాలను బయటపెట్టింది. రకుల్ ప్రీత్ సింగ్  చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: