టాలీవుడ్ లో క్లాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'ఫిదా'. ఈ సినిమాతోనే సాయి పల్లవి తెలుగు వెండితెరకు హీరయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలిచికొని ఆ తర్వాత అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకొని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈరోజు సాయి పల్లవికి ఈ రేంజ్ లో క్రేజ్ వచ్చిందంటే దానికి కారణం ఫిదా సినిమానే. అయితే నిజానికి ఈ సినిమాలో ముందుగా వరుణ్ తేజ్, సాయిపల్లవి లను హీరో హీరోయిన్గా అనుకోలేదట. 

ఈ విషయాన్ని దర్శకుడు జయంత్ సి. పరాన్జీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు జయంత్ ఫిదా సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఫిదా సినిమాను ముందుగా మహేష్ బాబు కోసం రాయగా.. అదే కథను మహేష్ బాబు వినిపిస్తే ఆయనకి బాగా నచ్చింది. నేను కూడా ఆ కథ విని బాగా ఇంప్రెస్ అయ్యాను. ఎలాగైనా సరే ఈ సినిమాని మహేష్ బాబు తో చేయాలని అనుకున్నాం. అందులో భాగంగానే ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనేని తీసుకోవాలని భావించాము. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మహేష్ బాబు, దీపికా పదుకొనే హీరో హీరోయిన్లుగా రాబోయే

 ఈ సినిమాని నేనే నిర్మించాలని అనుకున్నాను. కానీ మహేష్ బాబు లాంటి స్టార్ హీరో నుండి ఎలాంటి సినిమా వస్తుందోనని ప్రేక్షకులు కూడా కొన్ని రకాల అభిప్రాయాలను పెట్టుకుని ఉంటారు. అందుకే ఈ సినిమా వాళ్ళ అంచనాలను చేరుకుంటుందో లేదో అని భావించి ఆ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయాలన్న ఆలోచనను విరమించుకున్నాం. అలా మహేష్ బాబు నుంచి ఈ కథను వరుణ్ తేజ్ దగ్గరికి తీసుకెళ్లగా అతను ఓకే చేయడంతో సినిమా తీయడం జరిగింది. ఆ తర్వాత ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్ కి ఇటు సాయి పల్లవి ఎంతో మంచి పేరు వచ్చింది' అంటూ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు జయంత్. సి. పరాన్జీ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: