ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ప్రముఖ దర్శకులలో ఒకరైన డైమండ్ రత్నబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను అయితే చెప్పుకొచ్చారు. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి అల్లు అర్జున్ అని డైమండ్ రత్నబాబు పేర్కొన్నారు. ఆరేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ అమీర్ ఖాన్ అల్లుఅర్జున్ అని నేను చెప్పానని కూడా ఆయన తెలిపారు.

నేను ఆ విధంగా చెప్పడం లో కామెంట్లలో కొంతమంది ఓవరాక్షన్ చేయవద్దని అల్లు అర్జున్ కి అంత సీన్ లేదని అల్లు అర్జున్ పాన్ వరల్డ్ ఆర్టిస్ట్ అవుతాడా? అని కామెంట్లు కూడా చేశారని అల్లు అర్జున్ కు ఎందుకు సోప్ వేస్తున్నావని కూడా అన్నారని డైమండ్ రత్నబాబు చెప్పుకొచ్చారటా.. ఆ సమయంలో నేను చాలా నవ్వుకున్నానని అల్లుఅర్జున్ గొప్ప స్థాయికి వెళతాడని నాకు ముందే తెలుసని ఆయన తెలిపారు. బన్నీ జిమ్ మరియు డ్యాన్స్ చేయకుండా అస్సలు నిద్ర పోరని డైమండ్ రత్నబాబు అన్నారు. 5 సంవత్సరాల క్రితమే అల్లుఅర్జున్ ఈ స్థాయికి చేరుకుంటాడని నేను చెప్పానని కూడా ఆయన తెలిపారు.


నా పేరు విన్న వెంటనే అల్లుఅర్జున్ నవ్వారని సినిమా కథ పేరు గాలోడు అని చెప్పగానే అల్లుఅర్జున్ నవ్వారని రత్నబాబు కామెంట్లు చేశారు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాకు రైటర్ గా నాకు పని చేసే అవకాశం అల్లు అర్జున్ ద్వారా దక్కిందని కూడా ఆయన తెలిపారు. నేను అల్లుఅర్జున్ ని కలవడానికి సప్తగిరి కారణమని ఆయన చెప్పుకొచ్చారు. సప్తగిరి రుణం తీర్చుకోవాలని భావించి అన్ స్టాపబుల్ సినిమాలో ఛాన్స్ కూడా ఇచ్చానని డైమండ్ రత్నబాబు అన్నారు. మీడియా వాళ్లకు నేను అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నాపై ట్రోల్ చేశారని వాళ్లు మెచ్చుకునేలా చేయడమే నా లక్ష్యం అని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: