యస్కెయన్ నిర్మాణం లో సాయి రాజేష్ దర్శకత్వం లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్ర ల్లో వచ్చిన బేబీ సినిమా ఈనెల 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఒక చిన్న సినిమా కు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది.ఇప్పటి వరకు ఈ సినిమా 45 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి అందరిని ఆశ్చర్యాని కి గురి చేసింది. ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావడం తో ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు ఈ సినిమా పై ప్రశంసలు కురిపించారు.ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావడం తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకం గా అప్రిషియేషన్ ఈవెంట్ పేరుతో ఓ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమం లో భాగంగా చిత్ర బృందం గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు. అయితే అంతకు ముందు హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ నాకు మీలా డాన్స్ చేయడం రాదు మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాను అని తెలిపారు.ఈ వ్యాఖ్యల పై అల్లు అర్జున్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఆనంద్ మాట్లాడుతూ మీలాగా డాన్స్  నేర్చుకుంటున్నానని చెప్పారు. అయితే హీరోలు కావాలి అంటే డాన్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదని బన్నీ తెలిపారు.నాకు డాన్స్ వచ్చు కనుక నాలో ఉన్న టాలెంట్ బయట పెడుతున్నాను.అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్ మీరు బయట పెట్టండి. హీరో అవ్వాలంటే డ్యాన్సులు, ఫైట్స్ అవసరం లేదు. ఎవరి తీరు వాళ్ళది. మనం కష్టపడితే, మన ట్యాలెంట్ ఏంటో మన సినిమా కు తగ్గట్టు చూపిస్తే ఎవరైనా హీరోలు అవ్వచ్చు అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: