బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొంత కాలంగా వరుస అపజయాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర వెనుకబడిపోయిన షారుక్ తాజాగా ఈ సంవత్సరం విడుదల అయినటువంటి పఠాన్ మూవీ తో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకొని తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు. ఇలా పటాన్ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న షారుక్ ప్రస్తుతం జవాన్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ కి తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సూపర్ స్టార్ నయన తారమూవీ లో షారుక్ సరసన హీరోయిన్ గా కనిపించబోతుంది. ప్రియమణి ... యోగి బాబు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాలోని మొదటి పాటను కూడా విడుదల చేశారు. దీనికి ప్రస్తుతం మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఈ మూవీ ని హిందీ ... తమిళ్ ... తెలుగు భాషల్లో సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం 23 కోట్ల వరకు కోడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే షారుక్ హీరోగా రూపొందిన పటాన్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. దానితో జవాన్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: