రాజ్ కుంద్రా ఓ షోలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజ్ కుంద్రా, తన భార్య శిల్పాశెట్టి, మరదలు షమితా శెట్టితో కలిసి ఓ షోకి వెళ్లారు. ఆ షోలో రాజ్ కుంద్రా శిల్పాశెట్టి చెల్లి షమితా శెట్టితో రాత్రి పూట ఏం చేసేవారో చెప్పుకొచ్చారు. శిల్పాశెట్టిని చేసుకోవడం వల్ల తనకు చాలా మేలు జరిగిందని, పెళ్ళైన కొత్తలో ఆమె చాలా పద్ధతిగా ఉండేదని అన్నారు. శిల్పాకి పార్టీలు గట్రా నచ్చేవి కాదని.. రాత్రి 9 కాగానే నిద్రపోయేదని అన్నారు. దీంతో తనకు ఎప్పుడైనా పార్టీకి వెళ్లాలనిపిస్తే వాళ్ల చెల్లిని పిలిచేవాడినని, తను కూడా నో చెప్పకుండా తనకి తోడుగా వచ్చేదని అన్నారు. అయితే ఆమెకు ఇప్పుడప్పుడే పెళ్లి కాకూడదని తాను కోరుకుంటున్నానని షోలో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా శిల్పాశెట్టి, రాజ్ కుమార్ కుంద్రాల పెళ్లి 2009లో జరిగింది. శిల్పా సినీ ప్రయాణ విషయానికి వస్తే బాజిగర్ మూవీతో హిందీలో పరిచయం కాగా, ‘సాహస వీరుడు సాగర కన్య’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చేసిన వీడెవడండీ బాబు, ఆజాద్, భలేవాడివి బాసు చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎక్కువ అవకాశాలు రావడంతో అక్కడే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె కన్నడ, హిందీ, భాషల్లో సినిమాలు చేస్తూనే.. ఇండియా పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి