సందర్భంగా ఈమె ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే ఇలాంటి కమిట్మెంట్లకు ఓకే అనాల్సిందే అంటూ ఇదివరకు పలువురు సెలబ్రిటీలు క్యాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా రెజీనా కూడా ఈ విషయంపై మాట్లాడుతూ తనకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని తెలిపారు. తనకు 20 సంవత్సరాల వయసు ఉన్న సమయంలో అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు.
ఇలా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో ఒక వ్యక్తిని తాను సినిమా అవకాశాలు ఇవ్వమని అడిగాను అయితే ఆ వ్యక్తి మాత్రం తనకు ఫోన్ చేసి మీకు సినిమా అవకాశం ఇస్తాను కానీ అడ్జస్ట్మెంట్ కి ఓకే చెబితేనే తర్వాత షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు.అయితే అడ్జస్ట్మెంట్ అంటే నేను ఏదైనా రెమ్యూనరేషన్ పరంగా అనుకొని నా మేనేజర్ మాట్లాడుతారు అంటూ ఫోన్ కట్ చేశాను. అయితే మేనేజర్ తన వద్దకు వచ్చి అడ్జస్ట్మెంట్ అంటే రెమ్యూనరేషన్ పరంగా కాదు మేడం ఆయన మిమ్మల్ని అలాంటి కోరిక కోరుతున్నారు అంటూ చెప్పడంతో నాకు అసలు విషయం తెలిసిందని చెప్పారు. ఈ సంఘటన తర్వాత నాకు తిరిగి ఇలాంటి ఘటనలు ఎప్పుడూ ఎదురవలేదు అంటూ ఈ సందర్భంగా రెజీనా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి