ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈమె భరతనాట్యం, ఒడిసి లాంటి క్లాసికల్ డాన్స్ లలో మంచి ప్రావీణ్యత పొందింది. డాన్స్ గ్రూపుల్లో ప్రదర్శనలు ఇస్తూనే గుర్తింపు తెచ్చుకుని 17 ఏళ్లకే సీరియల్ నటిగా అడుగుపెట్టింది.ఆ సీరియల్ ద్వారా పాపులారిటీ సంపాదించుకొని 19 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చింది. 2001లో అమీర్ ఖాన్ లాగన్ సినిమా గ్రేసీకి మంచి గుర్తింపు తెచ్చింది. ఒక ఏడాది తేడాతో తెలుగులో అడుగుపెట్టి సంతోషం. అప్పు చేసి పప్పుకూడు సినిమాల్లో నటించింది.
ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. 2010లో మరోసారి రామ రామ కృష్ణ కృష్ణ, రామ్‌దేవ్ సినిమాలలో గెస్ట్ రోల్ ను ప్లే చేసింది. కానీ ఆమెకు గుర్తింపు రాలేదు. దీంతో మళ్ళీ హిందీ, పంజాబీలో 2017 వరకు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. అప్పట్లో అందంగా ఉన్న గ్రేసి వయసు పెరిగే కొద్దీ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇటీవల ఆమె ఫొటోస్ చూస్తున్న ప్రేక్షకులు ఆమె ఎవరో అని కాస్త తికమక పడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి