అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే నిజానికి ఈ సినిమా మీద చాలా మంచి అంచనాలు ఉన్నాయి ఇక వీటికి తోడు రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లలో పుష్ప మూవీ లో అల్లు అర్జున్ నటనకు గాను ఆయనకి నేషనల్ అవార్డ్ రావడం జరిగింది.నిజంగా ఇది ఒక వంతుకు మన తెలుగు వాళ్ళకి గర్వకారణం అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు పెద్ద పెద్ద హీరోలకి సైతం సాధ్యం కానీ నేషనల్ అవార్డ్ ను అల్లు అర్జున్ సంపాదించడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 మీద కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు గా తెలుస్తుంది...ఇక ఈ సినిమా తో మరో పాన్ ఇండియా భారీ హిట్ కొట్టడానికి కూడా అల్లు అర్జున్ అండ్ సుకుమార్ ట్రై చేస్తున్నట్టు గా తెలుస్తుంది... నిజానికి సుకుమార్ చాలా ఇంటెలిజెంట్ డైరెక్టర్ అనే విషయం మనకు తెలిసిందే. ఆయన చేసిన ప్రతి సినిమా లో ఏదో ఒక మంచి ఎలిమెంట్ ఉండేలా చూసుకుంటూనే దాని తాలూకు ఎమోషన్ ని కూడా చాలా బాగా పండిస్తాడు...

అలాంటి సీన్స్ తీయడం లో సుకుమార్ ఒక మంచి డైరెక్టర్ ఇక ఈయన పుష్ప 2 తర్వాత చేస్తున్న సినిమా ఏంటి అనేది ఇంకా ఎవరికి తెలీదు కానీ అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ పుష్ప 2 తర్వాత ఒక భారీ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నట్టు గా తెలుస్తుంది.ఇందులో తెలుగు, తమిళ్ హీరోలు కలిపి ఉంటారని తెలుస్తుంది. నిజానికి సుకుమార్ అంటే ఒక కథని తన కోణం లో ఆలోచించి దాని మీద పూర్తి గా విశ్లేషించిన తర్వాత సినిమా తీయాలి అని పట్టుబట్టి మరి దాని గురించి తెలుసుకొని అప్పుడు సినిమా తీస్తాడు. అందుకే ఆయన స్టోరీలు కానీ ఆయన సినిమాలు కానీ రియాలిటీ కి దగ్గరగా ఉంటాయి...అందుకే ఈయన చేసిన సినిమాల్లో హీరోలు చాలా బాగా ఎలివేట్ అవుతూ ఉంటారు...అయితే ఈయన చేయబోయే మల్టీ స్టారర్ సినిమాలో హీరోలు ఎవరనేది తోందరలోనే ప్రకటిస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: