నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో హీరో రవితేజ నటిస్తున్న తాజా యాక్షన్ చిత్రం టైగర్ నాగేశ్వరరావు ఈ సినిమాని అభిషేక అగర్వాల్ బ్యానర్ పై పాన్ ఇండియా లేవల్ల తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం టీజర్ సాంగ్స్ ను కూడా పలు రకాల పోస్టర్లను విడుదల చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా ట్రైలర్ కి సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.

సినిమా ట్రైలర్ ని అక్టోబర్ మూడవ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు సైతం నిన్నటి రోజున అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక అందుకు సంబంధించి రవితేజ ఒక కొత్త పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో రవితేజ సరసన బాలీవుడ్ హీరోయిన్స్ నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. అలాగే కీలకమైన పాత్రలలో అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, మురళి శర్మ నటిస్తూ ఉన్నారు.


ప్రమోషన్స్ విషయం పక్కన పెడితే ఈ సినిమా చుట్టూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉన్నది. ఈ సినిమా స్టువర్టపురం గజదొంగగా పేరు సంపాదించిన టైగర్ నాగేశ్వరరావు కథ అంశంతో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ లో స్టువర్టుపురం కి చెందిన ప్రజలను ఎరుకల జాతిగా కించపరిచే విధంగా సినిమాని తీస్తున్నారంటూ కూడా కొంతమంది ప్రజలు కోర్టుని ఆశ్రయించినట్లుగా సమాచారం .అంతేకాకుండా ఇటీవల విజయవాడలో నిరాహార దీక్షకు కూడా దిగినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ వివాదం పైన ఇప్పటి వరకు చిత్ర బృందం మాత్రం ఏ విధంగా స్పందించలేదు. మరి ఏ మేరకు ఈ సినిమా రవితేజ కెరీర్ కు ప్లస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: