ఇక అసలు విషయంలోకి వెళితే ఎన్టీఆర్ , రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సింహాద్రి సినిమా విడుదలయి ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో భూమిక ఎన్టీఆర్ ను పొడవడం మనం చూడవచ్చు. అయితే ఈ సన్నివేశం గురించి ఎన్టీఆర్ స్వయంగా రాజమౌళికి వెల్లడించారు.కారణమేమిటంటే క్లైమాక్స్లో ఏ సన్నివేశం పెడితే బాగుంటుంది అని రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుకుంటున్న సమయంలో.. హీరోయిన్ కి గతం గుర్తుకొచ్చి హీరోని పొడిస్తే.. మంచి ట్విస్ట్ ఉంటుంది కదా.. చూసే ఆడియన్స్ కి కూడా ఒక మంచి కిక్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పడంతో రాజమౌళి దీన్నే ఫాలో అయ్యి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.
ఇదే ఫార్ములా రాజమౌళి బాహుబలి 1 సినిమాలో కూడా ఉపయోగించారు. ఈ సినిమా క్లైమాక్స్ లో బాహుబలికి అత్యంత క్లోజ్ గా ఉండే కట్టప్ప.. బాహుబలిని వెన్నుపోటు పొడిచి.. ఎవరికి అర్థం కాకుండా క్లైమాక్స్లో పెట్టారు. ఎందుకంటే బాహుబలి 2 విడుదలయ్యే వరకు కూడా చాలామంది అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని తెలుసుకోవడానికి ఆసక్తికరంగా ఎదురు చూశారు. సో ఈ ఆలోచన జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమా వల్లే కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ పరోక్షంగా బాహుబలి హిట్ అవ్వడానికి కారకులు అయ్యారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి