భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన కానిస్టేబుల్ పాత్రలో నటించిన నటి మౌనిక రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సినిమా కంటే ముందే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది ఈ నటి. కానీ భీమ్లా నాయక్ సినిమా తర్వాత ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది. కేవలం సినిమాలే కాకుండా షణ్ముఖ జస్వంత్ హీరోగా వచ్చిన సూర్య వెబ్ సిరీస్లో సైతం హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ సిరీస్ ద్వారానే సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. అయితే ప్రస్తుతం ఈ నటి కి సంబంధించిన

ఒక వార్తా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే మౌనిక రెడ్డి తన భర్త సందీప్ తో విడాకులు తీసుకోబోతుంది అన్న వార్తలు  హాట్ టాపిక్ గా మారాయి. అలా వార్తలు రావడానికి కూడా ముఖ్య కారణం మౌనిక రెడ్డి అని అంటున్నారు. ఎందుకు అని అంటే ఆమె చేసిన కొన్ని పనుల వల్లే ఇలాంటి వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. విడిపోయే ముందు తమ భార్య భర్తలను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం తమ పెళ్లికి సంబంధించిన

ఫోటోలను డిలీట్ చేయడం ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేయడం చేస్తున్నారు. అలా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అని పరోక్షంగానే క్లారిటీ ఇస్తున్నారు. ఇటీవల నిహారిక సమంత శ్రీజ వంటి వారు సైతం ఇలాగే చేశారు. తాజాగా మౌనిక రెడ్డి సైతం తన సోషల్ మీడియా ఖాతాలో నుండి తన భర్త సందీప్ ను అన్ ఫాలో చేసింది. దానితోపాటు వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలు డిలీట్ చేయడంతో ఈ వార్తలు ఊపందుకున్నాయి. మౌనిక రెడ్డి విడాకులు తీసుకోబోతుంది అంటూ చాలామంది అంటున్నారు కానీ ఈ విషయానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఈ విషయంపై క్లారిటీ రావాలి అంటే మౌనిక రెడ్డి స్పందించాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: