అయితే ఇప్పుడైతే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎంతో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. కానీ ఒకప్పుడు ఏకంగా అన్న చాటు తమ్ముడిగా ఎంతో సిగ్గు బిడియం కలిగిన యువకుడిగా ఉండేవారు అన్న విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కెరియర్ తొలినాళ్లలో హీరో అవ్వాలని అనుకోలేదట. ఏకంగా డైరెక్టర్ కావాలని భావించాడట. కానీ కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో చివరికి పవన్ కళ్యాణ్ డైరెక్టర్ అవ్వాలని తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట. ఇలా డైరెక్టర్ కావాలని అనుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఒక షార్ట్ ఫిలిం కూడా కెరియర్ తొలినాళ్లల్లో డైరెక్ట్ చేశారట.
న్యూయార్క్ ఫిలిం అకాడమీ లో షార్ట్ ఫిలిం టర్మ్ కోర్స్ కోసం పవన్ కళ్యాణ్ దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఒక షార్ట్ ఫిలిం ని కూడా తీసి వాళ్ళకి పంపారట. ఇలా పవన్ కళ్యాణ్ తీసిన షార్ట్ ఫిలింలో అంధుల గురించి ఉంటుందట. అయితే ఆ సమయంలో న్యూయార్క్ ఫిలిం అకాడమీలో పీజీ ఎక్కువగా ఉండడం.. ఇక ఇతర కారణాల వల్ల ఆ పవన్ కళ్యాణ్ దర్శకత్వ మేలుకువలు నేర్చుకోకుండా వెనకడుగు వేశారట. ఆ సమయంలో ఇక అన్నయ్య చిరంజీవికి కూడా పవన్ కళ్యాణ్ దర్శకుడు అవడం ఇష్టం లేదు అని తెలిసి ఇక అన్నయ్య కోసం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని అనుకున్నాడట. అయితే పవన్ కళ్యాణ్ షార్ట్ ఫిలిం ని యూట్యూబ్లో అందుబాటులోకి తెస్తే బాగుంటుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి