మొన్నటి వరకు పూజా హెగ్డే, కృతి శెట్టి, రష్మిక మందన్న అంటూ ముగ్గురు హీరోయిన్లు వరుసగా అవకాశాలు అందుకునేవారు. కానీ ఇప్పుడు ఈ హీరోయిన్ల అందరి అవకాశాలను కూడా శ్రీలీల దక్కించుకుంటుంది. ఇక హీరోలతో సమానంగా డాన్సులు చేస్తూ అదరగొడుతుంది. ఇక తన అందం అభినయంతో కుర్ర కారు మతిపోగొడుతుంది ఈ సొగసరి. అయితే ఇటీవలే బాలయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. బాలయ్య హీరోగా కాజల్ హీరోయిన్గా నటించిన భగవంతు కేసరి సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో నటించింది శ్రీ లీల.
అయితే ఈ సినిమాలో తనలో దాగి ఉన్న సరికొత్త టాలెంట్ను చూపించింది. ఇప్పుడు వరకు డాన్సులతో అదరగొట్టడం నటనతో మెప్పించడం అందం అభినయంతో మెస్మరైజ్ చేయడం చేసిన శ్రీలీల భగవంతు కేసరి సినిమాలో మాత్రం తొలిసారి యాక్షన్ సీక్వెన్స్ లో నటించి అందరిని థ్రిల్ చేసింది. విజ్జి పాప అనే క్యారెక్టర్ లో ఒదిగిపోయి అదరగొట్టింది అని చెప్పాలి. ఇక శ్రీలలలో ఉన్న యాక్షన్ యాంగిల్ తో పాటు ఈ సినిమాలో చూపించిన ఎమోషన్ యాంగిల్ క్లిక్ అయింది అంటే మరో పదేళ్లు హీరోయిన్గా ఇండస్ట్రీలో తిరుగులేదు అని అటు సినీ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి