దసరా రేస్ ఎవరు ఊహించని విధంగా జరిగి ఈమూడు సినిమాల బయ్యర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. బాలయ్య ‘భగవంత్ కేసరి’ రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ విజయ్ ‘లియో’ ఇలా మూడు  సినిమాలు ప్రేక్షకులకు నిరాశను మిగలచ్చాయి. టాప్ హీరోల భారీ దక్షిణాది సినిమాలు అన్నీ   పాన్ ఇండియా సినిమాలుగా విడుదల అవుతున్న పరిస్థితులలో ఆసినిమాల   బాలీవుడ్ మార్కెట్  కోసం బాలీవుడ్ యాక్టర్స్ సౌత్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్నారు.



లేటెస్ట్ గా సంక్రాంతి రేస్ కు వచ్చిన ఈమూడు సినిమాలలోనూ టాప్ బాలీవుడ్ యాక్టర్స్ నటించినా  వారి వల్ల ఆమూడు సినిమాలకు ప్రత్యేకంగా వచ్చిన ప్రయోజనం లేదు  అన్న కామెంట్స్  వస్తున్నాయి.  ’భగవంత్ కేసరి’ మూవీలో స్టార్ యాక్టర్ అర్జున్ రాంపాల్ నటిండమే కాకుండా ఆసినిమా ప్రమోషన్ లో అర్జున్ రామ్ పాల్ చాల యాక్టివ్ గా పాల్గొన్నప్పటికీ ఆమూవీ ఊహించిన స్థాయిలో విజయవంతం లేదు. సీఎం నుంచి పీఎం వరకు మొత్తం రాజకీయ వ్యవస్థనే తన గుప్పిట్లో  ఉంచుకునే  ప్రతినాయకుడిగా అర్జున్ రామ్ పాల్ తన పాత్రకు న్యాయం చేసినప్పటికీ ఇలాంటి  పాత్రలతో  అనేక సినిమాలు రావడంతో సగటు ప్రేక్షకుడు పెదవి విరుస్తున్నాడు.  




దీనికితోడు బాలయ్య శ్రీలీల నటన ఎమోషనల్ సీన్స్ యాక్టింగ్ ముందు విలన్ పాత్ర  నిలబడా లేకపోయింది అన్నకామెంట్స్  కూడ వస్తున్నాయి. ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో సూపర్ టాలెంటెడ్ అనుపమ్ ఖేర్ను ఐబీ ఆఫీసర్గా చూపించారు. కానీ ఆతడి క్యారెక్టర్ కథపై ఎలాంటి ప్రభావం చూపలేక పోయింది.  ఇక  ఇదే దసరా రేస్ కు విడుదలలైన విజయ్ ‘లియో’  మూవీలో కూడా ఇదే  జరిగింది.



మంచి నటుడిగా పేరున్న  అనురాగ్ కశ్యప్ అలాగే సంజయ్ దత్  లాంటి  టాప్ ఆర్టిస్టులు ఈమూవీలో నటించిన ఈ సినిమాకు వారివల్ల ప్రత్యేకంగా వచ్చిన  ప్రయోజనం  లేదు  అన్న  కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఈ దసరా కు విడుదలైన మూడు చిత్రాలలోను పేరున్న బాలీవుడ్ యాక్టర్స్ భారీ పారితోషికాలు తీసుకుని నటించిన  వారెవ్వరూ రాణించ లేకపోయారు. దీనితో  ఈముగ్గురు దసరా సినిమాలను కాపాడలేకపోయారు అన్న  కామెంట్ వస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: