బిగ్ బాస్ ఫేమ్ దివి యోగ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. స్కిన్ టైట్ లో అమ్మడు అందాలు స్పష్టంగా కనిపిస్తుంటే కొంటె కామెంట్స్ వెలుగు చూస్తున్నాయి.బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గని గ్లామర్ దివి వద్ధ్యా సొంతం. అయితే ఆమెకు కాలం కలిసి రాలేదు. స్టార్ హీరోయిన్ అయ్యే రేంజ్ హిట్ పడలేదు. హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన దివికి చిన్నా చితకా ఆఫర్స్ మాత్రమే వచ్చాయి.కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన దివి స్టార్ హీరోల చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కిన మహర్షి చిత్రంలో కాలేజ్ స్టూడెంట్ పాత్రలో తళుక్కున మెరిసింది.ఈ క్రమంలో ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. దివి సీజన్ 4లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే పెద్దగా రాణించలేదు. దివి ఎఫైర్స్, కాంట్రవర్సీలకు దూరంగా ఉంది. అతికొద్ది మందితో ఆమె స్నేహం చేసింది.దివి అమ్మ రాజశేఖర్ తో స్నేహం చేసింది. వీరిద్దరికీ మంచి బాండింగ్ కుదిరింది. గ్లామర్ యాంగిల్ కూడా తక్కువే. దివి 7వ వారం 49వ ఎలిమినేట్ అయ్యింది. అయితే ఆమెకు షో వలన గుర్తింపు దక్కింది. దివి అనే ఓ హీరోయిన్ ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది.

 ప్రస్తుతం ఆమె కెరీర్ ఆశాజనకంగా సాగుతుంది. ఈ ఏడాది విడుదలైనన రుద్రంగి మూవీలో దివి కీలక రోల్ చేశారు. జగపతిబాబు, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రలు చేశారు. రుద్రంగి ఆశించిన స్థాయిలో ఆడలేదు.అలాగే మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన జిన్నా మూవీలో కీలక పాత్ర చేసింది. హీరో చిన్నప్పటి ఫ్రెండ్ అయిన మూగ అమ్మాయి పాత్రలో ఆమె నటించి మెప్పించారు. జిన్నా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ కమర్షియల్ గా ఆడలేదు.దివి చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప 2లో దివి జర్నలిస్ట్ రోల్ చేస్తుంది. ఈ పాన్ ఇండియా మూవీలో కొంచెం స్క్రీన్ స్పేస్ ఉన్న రోల్ ఆమెకు దక్కినట్లు తెలుస్తుంది. పుష్ప 2తో దివికి బ్రేక్ రావొచ్చు.ఇక సోషల్ మీడియాలో అమ్మడు గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో రచ్చ చేస్తుంది. దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. తాజాగా దివి యోగ భంగిమల్లో హీటు పుట్టించింది. స్కిన్ టైట్ డ్రెస్ ధరించి కవ్వించింది. దివి ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: