మెహర్ రమేష్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ ప్లాప్ డైరెక్టర్ గా మెహర్ రమేష్ పేరు పొందాడు.ఈ దర్శకుడు మొదట కన్నడ ఇండస్ట్రీలో పునీత్ రాజ్ కుమార్ తో రెండు సినిమాలు చేసి మెప్పించాడు.ఆ సినిమాలు మంచి విజయం సాధించాయి. అయితే మెహర్ రమేష్ కన్నడలో చేసిన రెండు సినిమాలు కూడా తెలుగు రీమేక్ లే కావడం విశేషం. వాటిలో ఒకటి మహేష్ బాబు ఒక్కడు, రెండవది ఎన్టీఆర్ ఆంధ్రావాలా. 2008లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కంత్రితో మెహర్ రమేష్ టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు.ఎన్టీఆర్ తో చేసిన కంత్రి సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.. ఆతర్వాత ప్రభాస్ తో బిల్లా సినిమా తెరకెక్కించాడు..ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. బిల్లా సినిమాలో ప్రభాస్ ను మెహర్ రమేష్ ఎంతో స్టైలిష్ గా చూపించారు.ఆ తరువాత ఎన్టీఆర్ తో మరోసారి శక్తి, వెంకటేష్ తో షాడో సినిమాలు  తెరకెక్కించి మెహర్ రమేష్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అందుకున్నాడు. షాడో సినిమా తరువాత కొంతకాలం సినిమాలకు దూరంగా వున్న మెహర్ రమేష్.. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి తో భోళా శంకర్ ను తెరకెక్కించాడు.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా దారుణంగా డిజాస్టర్ అయ్యింది . ఈ సినిమా తమిళ్ లో అజిత్ నటించిన వేదాళం కు రీమేక్. ఈ సినిమా రిలీజ్ సమయంలో సినిమాపై మెహర్ రమేష్ చేసిన కామెంట్స్ కు రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్ కు సంబంధం లేకపోవడంతో ఆయన పై వరుసగా ట్రోల్స్ వచ్చాయి.భోళా శంకర్ తరవాత మెహర్ రమేష్ సైలెంట్ అయిపోయారు.. ఇదిలా ఉంటే మెహర్ రమేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను ఎప్పటికైనా పవన్ కల్యాణ్ తో సినిమా తీస్తాను అని అన్నారు. తన దగ్గర ఇప్పటికే అదిరిపోయే కథ సిద్ధంగా ఉందని తెలిపారు. పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలని తాను మెంటల్ గా ఫిక్స్ అయినట్లు తెలిపారు.. ప్రస్తుతం మెహర్ రమేష్ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: