రామ్‌ నితిన్‌ , నార్నె నితిన్‌ , సంగీత్ శోభన్ , గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో మ్యాడ్ అనే కామెడీ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఈ సంవత్సరం అక్టోబర్ 6 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమాకి "ఓ టి టి" లో కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

ఇలా థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థలలో ఒకటి అయినటువంటి ఈటీవీ సంస్థ దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే ఈటీవీ ఛానల్ లో ఈ సంస్థ ప్రచారం చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: