ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద  వసూళ్ల దండయాత్ర చేస్తుంది 'యానిమల్'. విడుదలైన ఎనిమిది రోజుల్లోనే 600  కోట్లకు పైగా వసూళ్లు చేసింది ఈ సినిమా. ఇప్పటికీ ఈ మూవీకి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్,  రష్మిక మందన్నా జంటగా నటించారు. ఈ మూవీలో రష్మిక కంటే ఎక్కువగా ఫేమస్ అయ్యింది సెకండ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి. ఈ సినిమాలో ఆమె మరో కథానాయికగా నటించింది. హీరో రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలెట్ అయ్యాయి. అందువల్ల ఓవర్ నైట్ స్టా్ర్ అయ్యింది త్రిప్తి. ఇప్పుడు ఈ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ తో త్రిప్తికి బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఆఫర్స్ క్యూ కట్టాయి. తెలుగులో కూడా ప్రభాస్, రవి తేజ సినిమాల ఆఫర్స్ వచ్చాయని సమాచారం తెలుస్తుంది. ఇంకా అలాగే త్రిప్తికి ఫాలోవర్స్ సైతం పెరిగిపోయారు.యానిమల్ సినిమాకి ముందు త్రిప్తి పేరు అసలు చాలా మందికి తెలియదు.


నవంబర్ లో చివరి వారం త్రిప్తికి ఇన్ స్టాలో కేవలం 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 30 లక్షలకు చేరింది. 2015లో త్రిప్తి ఇన్ స్టాలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి నెట్టింట బాగా యాక్టివ్ గా ఉంటూ తన విశేషాలతోపాటు.. రీల్స్ తోనూ ఆమె సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పోస్టులన్నింటికి కూడా ఎన్నో లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.ఇక త్రిప్తి డిమ్రీ.. 1994 ఫిబ్రవరి 23న ఉత్తరాఖండ్ లో జన్మించింది. 2017లో పోస్టర్ బాయ్స్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఆమె అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత మజ్ను, ఫిల్మ్ బుల్బుల్, ఖలా చిత్రాల్లో త్రిప్తి నటించింది. కానీ యానిమల్ మూవీతోనే ఈ హాట్ బ్యూటీకి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ హాట్ బ్యూటీకి ఇండస్ట్రీలో ఎన్నో ఆఫర్స్ క్యూ కట్టాయి.త్రిప్తికి వస్తున్న క్రేజ్ చూసి రష్మిక, పూజ హెగ్డే లాంటి హాట్ హీరోఇన్లు తెగ కుళ్ళుకుంటున్నారు. ఖచ్చితంగా త్రిప్తి పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: