బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన యువ నటులలో రన్బీర్ కపూర్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీ లలో అద్భుతమైన విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా కాకుండా ఇతర దేశాలలో కూడా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ నటుడు తాజాగా యానిమల్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీలో నేషనల్ క్రైస్ట్ రష్మిక మంద న హీరోయిన్ గా నటించగా ... ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించాడు. 

మూవీ లో అనిల్ కపూర్ , రన్బీర్ కపూర్ కి తండ్రి పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ 1 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి వరల్డ్ పైడ్ గా అదిరిపోయే రేంజ్ సూపర్ కనెక్షన్ లు దక్కాయి. దానితో ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే భారీ మొత్తంలో షేర్ కలెక్షన్ లను రాబట్టి అదిరిపోయే లాభాలను అందుకుంది.

 ఇలా ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ మూవీ యొక్క సక్సెస్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. దీనికి మిల్కీ బ్యూటీ తమన్నా కూడా విచ్చేసింది. ఇకపోతే ఈ ఈవెంట్ కు ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన క్యూట్ అందాలు ఫోకస్ అయ్యేలా విచ్చేసింది. దానితో ఈవెంట్ కు సంబంధించిన కెమెరాలన్నీ ఈ బ్యూటీ వైపు తిరిగాయి. అలాగే ప్రస్తుతం తమన్నా కు సంబంధించిన ఈవెంట్ లోని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: