కొన్ని సంవత్సరాల క్రితం విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ మూవీ ఒక ట్రెండ్ సెటర్. ఈ మూవీతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లో యూత్ ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రయోగంతో యూత్ ను టార్గెట్ చేస్తూ మరొక సినిమా రాబోతోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించిన దీపక్ సరోజ్ ఇప్పుడు హీరోగా మారాడు.యంగ్ డైరెక్టర్ యశస్వీ దర్శకత్వంలో త్వరలో రిలీజ్ కాబోతున్న ‘సిద్దార్థ్ రాయ్’ మూవీ ట్రైలర్ ను చూసినవారు ఈమూవీలో ‘అర్జున్ రెడ్డి’ ఛాయలు కనిపిస్తున్నాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. విపరీతమైన తెలివితేటలు ఉన్న ‘సిద్దార్థ్ రాయ్’ దీపక్ సరోజ్ కు ఎటువంటి ఎమోషన్స్ ఉండవు. ఏది చేద్దాము అనుకుంటే వెంటనే చేస్తాడు. ఆఖరికి ఆ ఇంటిలో పని చేసే పనిమనిషితో కూడ శృంగారం చేసే సాహసం చేస్తాడు.ఇలాంటి విచిత్రమైన మనస్తత్వం ఉన్న ఆ వ్యక్తిని ఒక అమ్మాయి తన్వి నేగి ప్రేమిస్తుంది. వీరి ప్రేమ కొంత కాలం బాగున్నప్పటికీ వీరిద్దరి మధ్య అభిప్రాయ భేధాలు రావడంతో వీరిద్దరు పోలీస్ స్టేషన్ కు వెళతారు. వీరి సినిమాలో హీరో విపరీత ధోరణలు చూసిన వారికి అర్జున్ రెడ్డి మూవీలోని విజయ్ దేవరకొండ ఖచ్చితంగా గుర్తుకు వచ్చి తీరుతాడు. టెక్నికల్ గా ఈ మూవీ బాగా తీసినట్లుగా కనిపిస్తోంది.ఈ మూవీలో అనేక లిప్ లాక్ సీన్స్ కూడ ఉండటంతో మరొకసారి ఈమూవీ వివాదాలకు చిరునామాగా మారే ఆస్కారం ఉంది. హీరో కన్నా హీరోయిన్ ఈ మూవీలో హీరొకన్నా హీరోయిన్ అందంగా కనిపించడమే కాకుండా నటన విషయంలో ఆకట్టుకునేలా ఉంది. ఈమూవీని ఫిబ్రవరిలో విడుదల చేసే ఆస్కారం కనిపిస్తోంది. ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు అనుకోని విజయాలు సాధిస్తున్నాయి. ఎడల్ట్ కంటెంట్ తో వచ్చిన ‘బేబి’ లా ఈమూవీ కూడ అనుకోని విజయం సాధిస్తుందేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: