సంక్రాంతి సినిమాలకు ఏర్పడిన ధియేటర్ల కొరత పై ఎన్నో వార్తలు వచ్చాయి. టాప్ హీరోల సినిమాల తాకిడితో ‘హనుమాన్’ కు అన్యాయం జరుగుతోంది అంటూ ఎందరో ఓపెన్ గానే కామెంట్స్ చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎట్టకేలకు విజయం ‘హనుమాన్’ ను వరించింది. ఈ ధియేటర్ల పంచాయితీ ముగిసింది అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్న సమయంలో మళ్ళీ ధియేటర్ల రాజకీయాలకు సంబంధించిన వార్తలతో మళ్ళీ ఇండస్ట్రీ ఎలర్ట్ అయింది.వచ్చేనెల ఫిబ్రవరి 9న రవితేజా ‘ఈగల్’ విడుదల కాబోతోంది. వాస్తవానికి ఈసినిమా సంక్రాంతి రేస్ కు రావాలి అనుకుంది. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు అందరు మాస్ మహారాజా పై ఒత్తిడి చేసి అతడి సినిమాను ఫిబ్రవరి 9కి వాయిదా వేయించి అప్పట్లో ఊపిరి తీసుకున్నారు. ఫిబ్రవరి 9న ‘ఈగల్’ కు మరొక సినిమా పోటీ లేకుండా చూస్తామాని అమూవీ నిర్మాతలకు ఇండస్ట్రీ ప్రముఖులు మాట ఇచ్చారు అన్నప్రచారం కూడ జరిగింది.అయితే ఇప్పుడు అసలు పరిస్థితి వేరు ఫిబ్రవరి 9న మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. ఆ డేట్ ను టార్గెట్ చేస్తూ ‘యాత్ర 2’ రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈసినిమాను వాయిదా వేసుకోమని చెప్పే సాహసం ఎవరు చేయలేకపోతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. ఈసినిమాతో పాటు సందీప్ కిషన్ నటిస్తున్న ‘ఊరు పేరు భైరవ కొన’ సినిమా కూడ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈసినిమా ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ పై కూడ మంచి అంచనాలు ఉన్నాయి.ఈమూవీ నిర్మాత రాజేష్ దండా తన సినిమా వాయిదా కు ఏమాత్రం ఇష్టపడటం లేదు అన్న వస్తున్నాయి. ఈసినిమా ట్రైలర్ కు వచ్చిన స్పందన రీత్యా తన సినిమాకు బిజినెస్ బాగా జరిగిందని ఇప్పుడు ‘ఈగల్’ కోసం వాయిదా అంటే తనకు నష్టాలు వస్తాయని అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో మళ్ళీ ఈ చిన్న సినిమా రవితేజా కు ఎవరు ఊహించని షాక్ ఇస్తుందా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..సంక్రాంతి సినిమాలకు ఏర్పడిన ధియేటర్ల కొరత పై ఎన్నో వార్తలు వచ్చాయి. టాప్ హీరోల సినిమాల తాకిడితో ‘హనుమాన్’ కు అన్యాయం జరుగుతోంది అంటూ ఎందరో ఓపెన్ గానే కామెంట్స్ చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎట్టకేలకు విజయం ‘హనుమాన్’ ను వరించింది. ఈ ధియేటర్ల పంచాయితీ ముగిసింది అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్న సమయంలో మళ్ళీ ధియేటర్ల రాజకీయాలకు సంబంధించిన వార్తలతో మళ్ళీ ఇండస్ట్రీ ఎలర్ట్ అయింది.వచ్చేనెల ఫిబ్రవరి 9న రవితేజా ‘ఈగల్’ విడుదల కాబోతోంది. వాస్తవానికి ఈసినిమా సంక్రాంతి రేస్ కు రావాలి అనుకుంది. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు అందరు మాస్ మహారాజా పై ఒత్తిడి చేసి అతడి సినిమాను ఫిబ్రవరి 9కి వాయిదా వేయించి అప్పట్లో ఊపిరి తీసుకున్నారు. ఫిబ్రవరి 9న ‘ఈగల్’ కు మరొక సినిమా పోటీ లేకుండా చూస్తామాని అమూవీ నిర్మాతలకు ఇండస్ట్రీ ప్రముఖులు మాట ఇచ్చారు అన్నప్రచారం కూడ జరిగింది.అయితే ఇప్పుడు అసలు పరిస్థితి వేరు ఫిబ్రవరి 9న మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. ఆ డేట్ ను టార్గెట్ చేస్తూ ‘యాత్ర 2’ రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈసినిమాను వాయిదా వేసుకోమని చెప్పే సాహసం ఎవరు చేయలేకపోతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. ఈసినిమాతో పాటు సందీప్ కిషన్ నటిస్తున్న ‘ఊరు పేరు భైరవ కొన’ సినిమా కూడ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈసినిమా ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ పై కూడ మంచి అంచనాలు ఉన్నాయి.ఈమూవీ నిర్మాత రాజేష్ దండా తన సినిమా వాయిదా కు ఏమాత్రం ఇష్టపడటం లేదు అన్న వస్తున్నాయి. ఈసినిమా ట్రైలర్ కు వచ్చిన స్పందన రీత్యా తన సినిమాకు బిజినెస్ బాగా జరిగిందని ఇప్పుడు ‘ఈగల్’ కోసం వాయిదా అంటే తనకు నష్టాలు వస్తాయని అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో మళ్ళీ ఈ చిన్న సినిమా రవితేజా కు ఎవరు ఊహించని షాక్ ఇస్తుందా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..
మరింత సమాచారం తెలుసుకోండి: