టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. తన ప్రియుడు నిర్మాత జాకీ భగ్నానీతో రేపు (ఫిబ్రవరి 21న) ఏడుగులు వేయనుంది.వీరి వివాహం గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్‏లో జరగనుంది. ఇప్పటికే రిసార్ట్‏ను తెలుపు, నీలిరంగు పువ్వులతో అందంగా రెడీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే రకుల్, జాకీలతోపాటు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు గోవాకు చేరుకున్నారు. అలాగే తెలుగు, హిందీ ఇండస్ట్రీల నుంచి మరికొందరు సెలబ్రెటీలు వీరి పెళ్లికి హాజరు కానున్నట్లు సమాచారం. రకుల్ బెస్ట్ ఫ్రెండ్స్ మంచు లక్ష్మి, ప్రగ్యా జైస్వాల్ పెళ్లిలో సందడి చేయనున్నారు. సోమవారం హాల్దీ వేడుకలను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు సంగీత్, మెహందీ వేడుకలు జరగనున్నాయి. అయితే తన పెళ్లిపై రకుల్ కొన్ని కండిషన్స్ పెట్టిందట. ఇప్పటికే ప్రకృతి పర్యావరణానికి అనుకూలంగా ఎంతో సింపుల్, సంప్రాదాయబద్ధంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఇక తమ పెళ్లి వేడుకలో ఎలాంటి క్రాకర్స్ కాల్చకూడదని కండిషన్ పెట్టారట. అలాగే ఈ వేడుకలకు సినీ తారలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు పాల్గొంటున్నందున తమ ప్రైవసీ కోసం ఫోటోస్, సెల్ఫీలు తీసుకోవడంపై నిషేదం విధించారట. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్‌తో సహా అనేక వస్తువులను నిషేధించారు.పెళ్లికి సంబంధించిన ఫోటోగ్రాఫర్‌లకు మాత్రమే అనుమతి ఉంది. రకుల్ నిర్ణయాలపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా క్రాకర్స్, ప్లాస్టిక్ నిషేధించడంపై ఈ నూతన జంటను తెగ పొగిడేస్తున్నారు.నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది రకుల్. ఆ తర్వాత 2009 కన్నడ చిత్రం గిల్లితో తెరంగేట్రం చేసింది. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన 7G రెయిన్‌బో కాలనీకి ఇది కన్నడ రీమేక్. ఆ తర్వాత సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో తెలుగు తెరకు పరిచయమైంది. 2012లో తమిళంలో హిందీయార థాకా తోనూ అడుగుపెట్టింది. హిందీలో 2014లో యారియాన్ చిత్రంతో అడుగుపెట్టింది. రాహుల్ ప్రీత్ సింగ్ పంజాబ్ కు చెందిన సిక్కు. కోల్ కత్తాకు చెందిన ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో దాదాపు నాలుగేళ్లుగా ప్రేమలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: