టాలీవుడ్ స్టార్ హీరో మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భీమా'. ఎ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు.ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఇతర స్పెషల్ పోస్టర్స్, రెండు సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ తోనే హ్యూజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు చాలా జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు శనివారం హైదరాబాద్ లోని AAA సినిమాస్ లో గ్రాండ్ గా నిర్వహించిన ఈవెంట్ లో ట్రైలర్ ను రిలీజ్ చేసారు.గోపీచంద్ ను పవర్ ఫుల్ మాస్ యాక్షన్ రోల్ లో ప్రెజెంట్ చేసిన 'భీమా' ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. రెండున్నర నిమిషాలున్న ఈ వీడియో ద్వారా సినిమా హీరో పాత్ర ఎలా ఉండబోతోందనేది శాంపిల్ గా సూపర్ గా చూపించారు. అందులో దాదాపు ఒకటిన్నర నిమిషం పాటు హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేసే వాయిస్ ఓవర్ తో గూస్ బమ్స్ తెప్పించారు. అక్కడి నుంచి ఎండ్ దాకా గోపీచంద్ మార్క్ యాక్షన్ తో ఈ ట్రైలర్ సాగింది.


పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా గోపీచంద్ ఆకట్టుకున్నారు. అతని బాడీ లాంగ్వేజ్, హెయిర్ స్టైల్, డైలాగ్ డెలివరీ అంతా చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. దీంతో పాటుగా గోపీచంద్ మరో లుక్ ను కూడా ఈ ట్రెయిలర్ లో చూపించారు. లాంగ్ హెయిర్, కోర మీసాలతో చేతిలో గండ్ర గొడ్డలి పట్టుకొని ఉన్న పరశురాముడి అవతారాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో గోపీ ద్విపాత్రాభినయం చేశారా? లేదా ఒకే పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయా? అనే సందేహాలని కలిగేలా చేశారు. ఇక ఈ ట్రైలర్ లో హీరోయిన్ల పాత్రల గురించి పెద్దగా రివీల్ చేయనప్పటికీ, వారు రెండు షాట్స్ లో కనిపించి తమ ఉనికిని చాటుకున్నారు.మాస్‌, యాక్షన్‌తో కూడిన అంశాలు ఇందులో ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే అంశాలు కూడా ఉంటాయని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. అంతేకాదు దీంట్లో సోషియో ఫాంటసీ సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని అని ట్రైలర్ చివరలో హింట్ ఇచ్చారు. గోపీచంద్ నుంచి ఆడియన్స్ ఆశించే అంశాలతో దర్శకుడు హర్ష ఈ సినిమాని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.ఈ సినిమాని మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: