కేతిక శర్మకు కాలం కలిసిరాలేదు. లేదంటే ఆమె అందానికి స్టార్ కావాల్సింది. అయితే చిత్ర పరిశ్రమలో ఒకరి ఫేట్ నిర్ణయించేది విజయాలే. హిట్ దక్కని కేతిక శర్మ రేసులో వెనుకబడింది.
ప్రస్తుతం ఆమె ఖాతాలో ఒక్క చిత్రం కూడా లేదు.దర్శకుడు పూరి జగన్నాధ్ కేతిక శర్మను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. మోడల్ అయిన కేతిక శర్మకు హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చాడు. ఆయన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన ‘రొమాంటిక్’ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ నిర్మాతగా ఉన్నారు.రొమాంటిక్ మూవీ ఇంటెన్స్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. అయితే ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఆ తర్వాత నాగ శౌర్యకు జంటగా లక్ష్య చిత్రం చేసింది. స్పోర్ట్స్ డ్రామాగా లక్ష్య తెరకెక్కింది. ఈ మూవీ కోసం నాగ శౌర్య చాలా కష్టపడ్డాడు. గొప్ప ట్రాన్స్ఫార్మేషన్ సాధించాడు. లక్ష్య డిజాస్టర్ అయ్యింది.

ఇక మూడో చిత్రంగా రంగ రంగ వైభవంగా చిత్రం చేసింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రంగ రంగ చిత్రం కనీస ఆదరణ దక్కించుకోలేదు. అలా వరుసగా మూడు ప్లాప్స్ ఖాతాలో వేసుకుంది. దాంతో దర్శక నిర్మాతలు ఆమె పట్ల ఆసక్తి తగ్గించారు.గత ఏడాది పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో చిత్రంలో నటించింది. సాయి ధరమ్ తేజ్ తో జతకట్టింది. వినోదయ సిత్తం రీమేక్ గా తెరకెక్కిన బ్రో ఓ మోస్తరు విజయం అందుకుంది. కానీ ఈ మూవీలో కేతిక శర్మ పాత్ర నిడివి చాలా తక్కువ. అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర కాదు.ఎలాగైనా పుంజుకోవాలని కేతిక శర్మ ప్రయత్నాలు చేసింది. అందుకే సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ కి అందుబాటులో ఉంటుంది. తాజాగా రెడ్ షార్ట్ స్కర్ట్ ధరించి గ్లామరస్ లుక్ లో కాకరేపింది. అమ్మడు గ్లామరస్ అవతార్ వైరల్ గా మారింది. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: