దర్శకుడు వెంకీ అట్లూరి ఇండస్ట్రీలో నటుడుగా రాణించాలని ‘జ్ఞాపకం’ అన్న మూవీతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. అయితే ఆమూవీ అతడికి నటుడుగా ఏమాత్రం కలిసిరాలేదు. ఆతరువాత స్నేహ గీతం అన్న మూవీలో కూడ అతడు నటించాడు. అయితే అనుకోకుండా అతడు తన రూట్ మార్చి రచయితగా మారి ఆతరువాత దర్శకుడుగా మారిపోయాడు.పవన్ కళ్యాణ్ క్రేజీ మూవీ ‘తొలిప్రేమ’ మూవీ టైటిల్ ను తన మొదటి మూవీ టైటిల్ గా మార్చుకుని వరుణ్ తేజ్ తో అతడు తీసిన మొదటి సినిమా హిట్ కావడంతో అతడికి వరసపెట్టి అవకాశాలు వచ్చాయి. అయితే ఆతరువాత అతడు తీసిన ‘మిష్టర్ మజ్ను’ ‘రంగ్ డె’ సినిమాలు ఊహించిన స్థాయిలో విజయవంతం కాకపోవడంతో అతడికి మన తెలుగు హీరోల నుండి పెద్దగా అవకాశాలు రాలేదు.అయితే ఆతరువాత తమిళ హీరో ధనుష్ తో అతడు తీసిన ‘సార్’ మూవీ సూపర్ సక్సస్ కావడంతో ఒక్కసారిగా ఇతడి పేరు మళ్ళీ మారుమ్రోగడం ప్రారంభం అయింది. వెంకీ అట్లూరి నుండి వచ్చిన మొదటి మూడు సినిమాలు చూసిన వారికి ‘సార్’ లాంటి సామాజిక చైతన్యంతో కూడిన కథను ఈ దర్శకుడు తీశాడా అన్న ఆశ్చర్యంలో ముంచెత్తి వేసింది. ఈమూవీ ఇచ్చిన ఘన విజయంతో జోష్ లో ఉన్న ఈ దర్శకుడి ప్రతిభను నమ్మి మళయాళ క్రేజీ హీరో దుల్కర్ సల్మాన్ పిలిచి అవకాశం ఇవ్వడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.లక్కీ భాస్కర్ అన్న టైటిల్ తో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈమూవీ షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీ అవుట్ అండ్ అవుట్ కామెడీగా ఉంటుందని సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం దుల్కర్ కు తెలుగు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ రీత్యా ఈమూవీ బిజినెస్ బాగా జరుగుతున్నట్లు టాక్. ఊహించిన స్థాయిలో ఈమూవీ విజయవంతం అయితే దర్శకుడు వెంకీ మ్యానియా టాలీవుడ్ ను షేక్ చేసే ఆస్కారం ఉంది.. .మరింత సమాచారం తెలుసుకోండి: