ఈరోజు తెల్లవారుజామున బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటివద్ద కాల్పుల కలకలంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాల్పులు జరిపింది మేమే అంటూ గ్యాంగ్ స్టర్ ఆన్మోల్ బిష్ణోయ్ ప్రకటించడం జరిగింది.దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టాడు. సల్మాన్ ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. మాబలమేంటో నీకు అర్దమై ఉంటుంది. మా సహనాన్ని పరీక్షించొద్దు. ఈసారి తుపాకీ పేలుడు ఇంటిబయట ఆగదు అంటూ వార్నింగ్ జారీ చేసాడు.అన్మోల్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అయితే ప్రస్తుతం అతడు యుఎస్‌లో దాక్కున్నాడు. సల్మాన్ ఖాన్ గత కొంతకాలంగా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదుర్కుంటోన్న సంగతి తెలిసిందే. లేఖల రూపంలో.. ఈమెయిల్స్ రూపంలో చంపేస్తామంటూ చాలాసార్లు బెదిరించడం జరిగింది. ఇక ఈ క్రమంలో ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్ కి భద్రత మరింత పటిష్టం చేసారు.


తాజా ఘటనతో మరోసారి భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఏమాత్రం సేఫ్టీ లేకపోయినా సల్మాన్ ప్రాణాలు పోవడం ఖాయం లా ఉంది అతడి పరిస్థితి.అయితే ప్రభుత్వ సెక్యురిటీ మాత్రమే కాకుండా సల్మాన్ వ్యక్తిగత సిబ్బందిని కూడా నియమించుకున్నారు. ఆయన వెంట ఎప్పుడు కూడా బాడీ గార్డులుంటారు. 2018 వ సంవత్సరంలో బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు సంపత్ నెహ్రా సల్మాన్ ఖాన్‌ ఇంటి ముందు రెక్కీ నిర్వహించాడు. అతడు దాడికి తెగబడకముందే పోలీసులకు చిక్కడంతో సల్మాన్‌ ఖాన్ పై దాడి ప్లాన్ పోలీసులకు తెలిసింది. సింగర్ సిద్ధూ మూస్ వాలా హత్య కేసులో అన్మోల్ బిష్ణోయ్ అలియాస్ భాను పరారీలో ఉన్న నిందితుడు. అతడు నకిలీ పాస్‌పోర్ట్‌తో భారతదేశం నుండి పారిపోయాడని గత సంవత్సరం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జిషీట్ వేసింది.అయితే సల్మాన్ ఖాన్ ని ని తమ అనుమతి లేకుండా బయటకు వెళ్లకూడదని పోలీసులు ఆంక్షలు కూడా విధించినట్లు అనేక వార్తలొస్తున్నాయి.అందుకే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ లు చేయడం లేదు. ఇటీవలే దర్శకుడు మురగదాస్ తో సికందర్ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. పరిస్థితిలో చక్క బడ్డాక త్వరలో ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: