సత్యదేవ్ హీరోగా నటించిన కృష్ణమ్మ మూవీ థియేటర్లలో రిలీజైన వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. మే 10న కృష్ణమ్మ థియేటర్లలో విడుదలవ్వగా...మే 17న ఓటీటీలోకి ఈ మూవీ రిలీజైంది.ఒకప్పుడు థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీ లోకి రావాలంటే చాలా సమయం తీసుకునేవి. కానీ, ఇప్పుడు చాలా వరకు సినిమాలు ఏ రోజైతే థియేటర్ లో రిలీజ్ అవుతున్నాయో..అదే రోజు ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్స్ కూడా డిసైడ్ అయిపోతున్నాయి. ఇక ఓటీటీ రూల్స్ ప్రకారం ఆయా సినిమాలు ఓటీటీ కి రావాలంటే మాత్రం కనీసం నెల రోజులు సమయం పడుతుంది. లేదా ఆయా సినిమాల థియేట్రికల్ రన్ ను బట్టి.. కొన్ని సినిమాలు విడుదలైన నెల రోజులలోపే ఓటీటీ లో దర్శనం ఇచ్చేస్తుంటాయి. తాజాగా సత్య దేవ్ నటించిన కృష్ణమ్మ సినిమా పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ సినిమా అయితే, కేవలం వారం రోజుల్లోనే ఓటీటీ లోకి వచ్చేస్తుంది. మరి ఈ సినిమా ఎప్పుడు ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

సత్య దేవ్ ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ కూడా ఓ మంచి కథను కలిగిఉంటాయి సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఓ మంచి హీరోగా ఎదిగాడు సత్య దేవ్. ఈ క్రమంలో తాజాగా సత్య దేవ్ నటించిన సినిమా 'కృష్ణమ్మ'. ఇప్పటివరకు కొన్ని సినిమాలలో సాఫ్ట్ గా కనిపించిన సత్య దేవ్ ఈ సినిమాలో మాత్రం కాస్త మాస్ యాంగిల్ లో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా మే 10 న థియేటర్ లో రిలీజ్ అయింది. కాగా ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో సత్య దేవ్, అనిత రాజ్ మీసాల లక్ష్మణ్, కృష్ణ బూరుగుల, అర్చన ముఖ్య పాత్రలలో ప్రేక్షకులను అలరించారు, థియేటర్ లో యావరేజ్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా.. నెల కాదు కదా వారం రోజుల్లోనే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వడం గమనార్హం. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమాను మే 17 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అమెజాన్ ప్రైమ్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ఇక కృష్ణమ్మ సినిమా కథ విషయానికొస్తే.. సత్యదేవ్, కృష్ణ తేజ రెడ్డి, మీసాల లక్ష్మణ్ ఈ ముగ్గురు ఆనాధలు. చిన్నప్పటినుంచి విజయవాడలోనే ఈ ముగ్గురు కలిసి పెరుగుతారు. కృష్ణ తేజ రెడ్డి చిన్న ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉంటాడు. సత్యదేవ్, మీసాల లక్ష్మణ్ స్మగ్లింగ్ పనులు చేస్తూ ఉంటారు. అయితే వీరంతా చిన్నతనం నుంచి అనాధలు అయిన కారణంగా వారికంటూ ఓ కుటుంబం ఉండాలని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారికీ ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె పరిచయం తర్వాత వారిలో మార్పు వస్తుంది. ఈ క్రమంలో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అనారోగ్యంగా ఉండడం చేత.. భారీగా డబ్బు అవసరం అవుతుంది. దీనితో చివరి సారిగా స్మగ్లింగ్ చేసి డబ్బు సంపాదించాలని డిసైడ్ అవుతారు. కానీ అనుకోకుండా వారంతా పోలీసులకు పట్టుబడతారు. వారిపై స్మగ్లింగ్ తో పాటు.. రేప్ అండ్ మర్డర్ కేసు కూడా నమోదు అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ హత్యాచారానికి గురైన అమ్మాయి ఎవరు ! ఈ ముగ్గురుని పోలీసులు ఏం చేశారు ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: