మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఆయన తదుపరి మూవీ "విశ్వంభర" కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని చిరంజీవి గతంలో చేసిన సైరా సినిమాతో పోలిస్తే, ఇంకా పెద్ద అంచనాలను పెంచుతోంది."బింబిసార" వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు సగం పూర్తయింది.విశ్వంభర సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో రాబోతున్నదని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు. టైటిల్ మోషన్ పోస్టర్ విడుదలైన తర్వాత, ప్రేక్షకుల్లో ఈ మూవీపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో తన అభిమానులు కోరుకుంటున్న విధంగా మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నారు.ఇక సినిమాకి సంబంధించి ఉన్న హైప్ కి తోడు, స్టార్ క్యాస్ట్ కూడా చాలా బలంగా ఉంది. ముఖ్యంగా చిరంజీవికి జోడీగా సీనియర్ హీరోయిన్ త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే. స్టాలిన్ మూవీలో  నటించిన ఈ జంట మళ్లీ ఇన్నాళ్ల తరువాత కలిసి నటించడం విశేషం.


ఇంకా అలాగే, మీనాక్షి చౌదరి, సురభి, ఇషా చావ్లా, ఆశికా రంగనాథ్ వంటి ప్రముఖ హీరోయిన్లు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు.ఈ మూవీకి సంబంధించి ఒక షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. తదుపరి షెడ్యూల్లో దాదాపు మిగిలిన షూటింగ్ పూర్తిచేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన భారీ సెట్ కూడా నిర్మించారు. జులై నాటికి షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నం కానున్నారు మేకర్స్. సీజీ ఇంకా వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం చిత్రబృందం విదేశాలకు వెళ్లనున్నారు.ఈ మూవీని 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రమోషన్స్ కోసం కూడా ప్రత్యేక సమయాన్ని కూడా కేటాయిస్తున్నారు. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా కంటెంట్ కు తగ్గట్లే హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక వశిష్ఠ బింబిసార లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత, ఈ మూవీని కూడా అంతకుమించిన స్థాయిలో గ్రాండ్ స్కేల్ పై తెరకెక్కిస్తున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: