పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి. ఇక ఈ సినిమా మరొక నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు కల్కి సినిమాకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా కూడా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. అంతేకాదు సినిమా ప్రమోషన్స్ కోసం ఇంత బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు.. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఇంత ఖర్చు చేస్తున్నారు అన్న వార్తలు తరచూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున

 వినబడుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు కల్కి విడుదల ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు డార్లింగ్ అభిమానులు. అంతేకాదు కల్కి ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ వస్తే కూడా బాగుంటుంది అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడు కల్కి సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే.  ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలోని బుజ్జి ను పరిచయం చేస్తూ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఇక ఆ ఈవెంట్లో భాగంగా ప్రభాస్ అందులో

 చాలా హైలెట్ గా నిలిచాడు. ఇక ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.." చిన్నప్పుడు కమలహాసన్ గారు నటించిన సాగరసంగమం సినిమా లో కమల్ హాసన్ వేసుకున్న లాంటి డ్రెస్ కావాలి అని అప్పట్లో నేను నా పేరెంట్స్ ని చాలా ఇబ్బంది పెట్టాను అంటూ ఈ సందర్భంగా తెలిపాడు. అంతేకాదు  ఆ డ్రస్ వేసుకుంటే నేను కూడా కమల్ హాసన్ లాగా డాన్స్ చేయవచ్చు అని అనుకునేవాడిని అంటూ తెలిపాడు ప్రభాస్. కానీ ఆయన లాగా తల మాత్రం అస్సలు తిప్పలేకపోయాను అని చెప్పాడు. ఇకపోతే ప్రభాస్ సినిమాలోని బుజ్జి ను పరిచయం చేయడంతో ఇప్పుడు సినిమాలో బుజ్జి పాత్ర ఏ విధంగా ఉంటుందో అన్న సందేహాలు నెలకొన్నాయి. అంతేకాదు బుజ్జి గ్లిమ్ప్స్  ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ లో ఉంది అన్న కామెంట్స్ వినబడుతున్నాయి. మరి ప్రమోషన్స్ ఈ రేంజ్ లో చేస్తున్న కల్కి సినిమా విడుదలై ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: