టాలీవుడ్ యువ నటుడు ఆశిష్ తాజాగా లవ్ మీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. అర్జున్ భీమవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై జనాలు మంచి అంచనాలు పెట్టుకున్నారు. 

మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు పెద్ద స్థాయిలో కలెక్షన్ లు కూడా దక్కలేదు. చివరగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ సంస్థ వారు మరి కొన్ని రోజుల్లోనే లవ్ మీ మూవీ ని తమ ఓ టీ టీ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఆశిష్ "రౌడీ బాయ్స్" మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత సెల్ఫీస్ అనే మూవీ ని మొదలు పెట్టి మధ్యలో ఆపేశాడు. ఇక తాజాగా లవ్ మీ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మరి తిరిగి సెల్ఫీస్ మూవీ ని ప్రారంభిస్తారో... లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: