మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.. ఎన్నో సినిమాలలో అద్భుతంగా నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు..ప్రస్తుతం ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా ఎంతో పాపులర్ అయిన హీరో.. కెరీర్ లో ఎత్తు పల్లాలు ఎదుర్కోని ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరుకున్నారు.అయితే ఎన్టీఆర్ కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ మూవీ “ఆది”.. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తెరకెక్కించిన  సూపర్ హిట్ మూవీ ‘ఆది’. 2002 మార్చి 28న రిలీజ్ అయిన ఈ చిత్రానికి బెల్లంకొండ సురేష్ నిర్మాతగా వ్యవహారించారు..ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని స్థాయిలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం ఆ రోజుల్లో ఏకంగా 108 కేంద్రాల్లో 50 రోజులు అలాగే 98 కేంద్రాల్లో 100 రోజులు ఆడి ఆ రోజుల్లో ఆల్ టైం రికార్డు సృష్టించింది.. 

ఈ చిత్రంతో ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా చలామణి అవుతున్న దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ రంగంలో గట్టిగా నిలదొక్కుకున్నారు.. తను ఇంతలా ఎదగడానికి కారణం ఆది సినిమా అని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన కీర్తి చావ్లా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.’ఆది’ లో ఆమె నందిని అనే పాత్రలో చాలా అద్భుతంగా నటించింది.. తన గ్లామర్ తో ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది..  ఈ సినిమా తర్వాత కీర్తి చావ్లాకు వరుస ఆఫర్స్ వచ్చాయి.. ఆమె ‘కాశి’ ‘శ్రావణ మాసం’ ‘ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు’ ‘సాధ్యం’ మరియు ‘బ్రోకర్’ వంటి సినిమాల్లో నటించింది.కానీ అవి ప్లాప్ అవ్వడంతో కీర్తి కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగలేదు.తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించినా ఈమెకు అదృష్టం కలిసి రాలేదు..దీనితో కీర్తి చావ్లా సినిమాలకు దూరమైంది.హీరోయిన్ గా ఫేడ్ ఔట్ అయినా కానీ ఈ భామ సోషల్ మీడియాలో  చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.అయితే ఆమె లేటెస్ట్ ఫోటోలు చూసి అంతా షాక్ అవుతున్నారు.. కీర్తి ఏంటి ఇంతలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: