
గతంలో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తో ఏడడుగులు వేయబోతోంది అంటూ వార్తలు రాగా.. దానిపై స్పందించిన ఈమె ఆ తర్వాత 15 ఏళ్ల నుంచి తాను రిలేషన్ లో ఉన్న విషయాన్ని బయట పెట్టింది. అలా హైదరాబాద్ కి చెందిన సన్నీ వర్మాను ప్రేమిస్తున్నట్లు తెలిపిన ఈమె మార్చ్ 9న నిశ్చితార్థం చేసుకొని అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఇక ఇటీవల రిసెప్షన్ కూడా నిర్వహించారు. ఎట్టకేలకు నిన్న రాత్రి వీరి వివాహం జరిగింది. జూబ్లీహిల్స్ లోని జేఆర్సి కన్వెన్షన్ హాల్లో ఈ జంట మూడు ముళ్ళు ఏడడుగులతో ఒక్కటయ్యారు.
ప్రస్తుతం అభినయ, సన్నీ వర్మ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను చూసిన అభిమానులు, సినీ సెలబ్రిటీలు అభినయకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే వివాహం అనంతరం అభినయ పెళ్లి జీవితానికే పరిమితమవుతుందా లేక సినిమాలలో నటిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. సాధారణంగా వివాహం జరిగిన తర్వాత చాలామంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు మరికొంతమంది ఇంటికే పరిమితం అవుతున్నారు ఈ క్రమంలోనే అనుమానాలు వ్యక్తమవుతుండగా.. మరి అభినయ ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి. లేకపోతే సోషల్ మీడియాలో అభినయ పెళ్లి ఫోటోలతో పాటు వీరు నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి