తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో అక్కినేని అఖిల్ ఒకరు. ఈయన అఖిల్ అనే మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయింది. కాని ఈ మూవీ ద్వారా అఖిల్ కి మంచి విజయం దక్కలేదు. ఈ మూవీ తర్వాత ఈయన నటించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అఖిల్ ఆఖరుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే సినిమాలో హీరో గా నటించాడు. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇప్పటివరకు అఖిల్ చాలా సినిమాల్లో హీరోగా నటించిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో మాత్రమే అఖిల్ కు మంచి విజయం దక్కింది. ఇది ఇలా ఉంటే తాజాగా అఖిల్ "లెనిన్" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన ఓ వీడియోను కూడా కొన్ని రోజుల క్రితం మేకర్స్ విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ కేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమా సాంగ్ షూట్ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మూవీ సాంగ్ షూట్ కోసం మేకర్స్ అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్ ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ షూట్ పూర్తి అయ్యాక మేకర్స్ ఈ మూవీ కి సంబంధించిన ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశం కోసం కూడా ఓ భారీ సెట్ ను నిర్మించడం కోసం మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: