బన్నీ అట్లీ కాంబినేషన్ మూవీ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించగా ఈ సినిమాలో అనన్య పాండే ఎంపికైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో అనన్య పాండేకు నటిగా మంచి గుర్తింపు ఉన్నా తెలుగులో ఆమె నటించిన లైగర్ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంది.
 
లైగర్ సినిమాకు అనన్య పాండే మైనస్ అయ్యారే తప్ప ప్లస్ కాలేదు. ఈ సినిమాకు సంబంధించి ఆమె ఎక్స్ ప్రెషన్స్ విషయంలో సైతం తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. బన్నీ అట్లీ కాంబో మూవీ హీరోయిన్ విషయంలో చివరకు ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో హాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేస్తే బాగుంటుందని అల్లు అర్జున్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
సినిమా అలు అర్జున్ 22వ సినిమాగా తెరకెక్కుతుండగా అట్లీ 6వ సినిమాగా తెరకెక్కుతోంది. వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న అట్లీ తర్వాత సినిమాలతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది. అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీ బడ్జెట్ 700 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి అప్ డేట్ ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందనే చెప్పాలి.
 
సన్ పిక్చర్స్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీ ఎప్పుడు విడుదలైనా రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని చెప్పవచ్చు. బన్నీ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: