గత రెండు నెలలుగా తెలుగు రాష్ట్రాలలోని ధియేటర్ల పరిస్థితి అత్యంత అయోమయంగా మారింది. వారానికి రెండు మూడు సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ అసినిమాలాలో కొన్నింటికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆసినిమాలు ఏమాత్రం కలక్షన్స్ పరంగా ప్రభావం చూపించకాపోవడంతో ధియేటర్లు అన్నీ ఖాళీగా కనిపిస్తూ గోడౌన్ లుగా మారిపోయాయి.

దీనితో టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి కరువు పరిస్థితులు ఏర్పడ్డాయ అంటూ ఇండస్ట్రీ ప్రముఖులు టెన్షన్ పడుతున్నారు. చిన్న సినిమాల పరిస్థితి ఇలా ఉంటే వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణంలో ఉన్న టాప్ హీరోల సినిమాల పరిస్థితి ఏమిటి అంటూ ఆమూవీల నిర్మాతలు బయ్యర్లు తెగ టెన్షన్ పడుతున్న పరిస్థితులలో నేడు విడుదలైనా నాని ‘హిట్ 3’ మూవీకి వస్తున్న భారీ ఓపెనింగ్ కలక్షన్స్ ను చూసి ఇండస్ట్రీ వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.

ఈసినిమాతో పోటీగా సూర్య నటించిన ‘రెట్రో’ బాలీవుడ్ ‘రైడ్’ మూవీ విడుదల అయినప్పటికీ ఆ రెండు సినిమాలను ప్రేక్షకులు పట్టించుకొకపోవడంతో నానీకి పరిస్థితులు అన్నీ కలిసి వస్తున్నాయి. ఈసినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్ర లేనప్పటికీ ప్రేక్షకులు ఆవిషయాన్ని పట్టించుకోకుండా కేవలం నాని ఈమూవీలో చేసిన పాత్ర గురించే మాట్లాడుకుంటున్నారు.

ఈమూవీలోని పాత్రలు అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కి యూత్ లో క్రేజ్ లేనప్పటికీ ఇన్ని ప్రతికూలతలు పట్టించుకోకుండా నాని ‘హిట్ 3’ బుక్ మై షోలో జరుగుతున్న టిక్కెట్ల అమ్మకాలు చూస్తుంటే నాని ఈసినిమా ప్రమోషన్ విషయంలో పడ్డ కష్టానికి ఫలితం దక్కినట్లు కనిపిస్తోంది. ఈమూవీకి వచ్చిన డివైడ్ టాక్ పట్టించుకోకుండా ఈమూవీకి వస్తున్న కలక్షన్స్ నిలబడగలిగితే నాని కోరుకున్న హిట్ ‘హిట్ 3’ ఇవ్వగలిగింది అనుకోవాలి.

అయితే ఈ వీకెండ్ తరువాత వచ్చే మొదటి సోమవారం పరీక్షలో ఈమూవీకి వచ్చే కలక్షన్స్ ను బట్టి ఏ రేంజ్ కలక్షన్స్ కు ఈమూవీ చేరుకుంటుంది అన్న క్లారిటీ వచ్చే ఆస్కారం కనిపిస్తోంది. ఏది ఎలా ఉన్నా నాని కృషికి ఫలితం వచ్చింది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: