
తల్లికి వందనం పథకం కోసం నిధులను కూడా 9,407 కోట్ల రూపాయలను కేటాయించారు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి 15000 చొప్పున ఇస్తామంటూ సీఎం చంద్రబాబు తెలియజేశారు. అయితే ఈ డబ్బులను ఇన్స్టాల్మెంట్ లో ఇవ్వాలా లేకపోతే ఒకేసారి సెటిల్ చేయాలా అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలుపైన లబ్ధిదారులకు సంబంధించి ఒక అంచనా వేసినట్లు తెలుస్తున్నది. అలాగే మరొక పక్క ఈ పథకం అమలు విషయంలో విద్యార్థులకు 75% వరకు హాజరు ఉండాల్సిందే అనే నిబంధన మాత్రం కొనసాగింపు ఉంటుందనే విధంగా వినిపిస్తోంది.
ఇదే సమయంలో ఆదాయపన్ను చెల్లించే వారికి , తెల్ల రేషన్ కార్డు లేని వారికి, 300 యూనిట్ల కంటే ఎక్కువ వచ్చేవారికి, కారు కలిగిన వారికి సైతం ఈ పథకాన్ని అందించాలా వద్దా అనే విషయంలో ఇంకా ఏపీ ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.మరి త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారికంగా అర్హతలు అనర్హతలు విషయం పైన క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. ఒకవేళ వీరందరికీ కూడా అర్హులే అంటే ఇక కూటమి ప్రభుత్వానికి ఇది ప్లస్ అవుతుంది. ఎందుకంటే గతంలో వైసిపి ప్రభుత్వంలో వీరికి ఇవ్వలేదు కనుక.. అప్పట్లో ఈ విషయాల పైన కూడా చాలామంది విమర్శించారు టిడిపి నేతలు.. ముఖ్యంగా (నాలుగు చక్రాల వాహనం కలిగిన వారికి, భూమి ఎక్కువగా ఉన్నవారికి, 3 యూనిట్ కలిగిన వారికి) మరి ఇప్పుడేంటన్నది చూడాలి.