తమిళ సినిమాలను తెలుగులోకి అనువాదించి మరి చేస్తూ ఉంటారు. అయితే తెలుగులో సినిమా చేసే ప్రయత్నం మాత్రం ఇప్పటివరకు చేయలేదు విశాల్. సెల్యూట్ సినిమాని అటు తమిళం తో పాటు తెలుగులో ఒకేసారి తెరకెక్కించి విడుదల చేశారు. ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్న ఆ తర్వాత పిస్తా సినిమాని కూడా అలాగే విడుదల చేయడం జరిగింది.. ఈ రెండు చిత్రాలు తప్ప విశాల్ పేరిట తెలుగు సినిమాలు ఇది అని చెప్పుకోవడానికి ఒకటి కూడా లేదట.
అయితే ఇప్పటివరకు హీరో విశాల్ ప్రత్యేకించి తెలుగు సినిమా కోసం హైదరాబాదులో లాంచ్ చేసిన కార్యక్రమం కూడా లేదట. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో ముందుకు వెళుతున్నప్పటికీ విశాల్ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీని కాస్త లైట్గా తీసుకున్నట్టుగా కనిపిస్తున్నది.మరి తెలుగు సినిమాల విషయంలో హీరో విశాల్ ఇంత కఠినంగా ఉండడానికి గల కారణం ఏంటి? లేకపోతే తెలుగు సినిమాలకే గుడ్ బై చెప్పేసి కేవలం తమిళ సినిమాలలో నటించి వాటిని తెలుగులో రిలీజ్ చేసేలా చూస్తున్నారా అనే విధంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హీరో విశాల్ డిటెక్టివ్ 2 చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. మరి చిత్రాన్ని కూడా తెలుగు, తమిళంలో రిలీజ్ చేయబోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి