జయం రవి భార్య ఆర్తి తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో సంచలన పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు జయం రవి తన భార్య ఆర్తిని బలవంతంగా వదిలేసారు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే జయం రవి విడాకుల విషయాన్ని బయట పెట్టే సమయంలో నాకు తెలియకుండా విడాకులకు ఎలా అప్లై చేస్తారు.నా అవసరం లేదా అంటూ మండిపడింది. అయితే జయం రవి తన అన్ని సంవత్సరాల వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పడానికి కారణం సింగర్ కెనీషా అని ఆమెతో రిలేషన్ లో ఉండడం వల్లే భార్యకు విడాకులు ఇచ్చారు అనే రూమర్లు వినిపించాయి. అయితే ఈ రూమర్లపై కెనీషా మాట్లాడుతూ.. నా దగ్గర కి జయం రవి చాలా డిప్రెషన్ లో ఉన్నప్పుడు వచ్చాడు. ఆయన నా క్లయింట్.ఆర్తి,ఆమె పేరెంట్స్ పెట్టిన టార్చర్ భరించలేక ఆయన చాలా ఒత్తిడికి గురయ్యారు.ఇప్పుడిప్పుడే ఆయన ఆ ఒత్తిడి నుండి బయటపడుతున్నారు. మా మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు అని చెప్పింది. 

అయితే ఈ వార్తలన్నీ పక్కన పెడితే తాజాగా ఇషారి కె.గణేష్ కుమార్తె పెళ్లిలో జయం రవి తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ సింగర్ కెనషాతో కనిపించారు. ఇక ఈ పెళ్లిలో వీరిద్దరూ అచ్చం భార్యాభర్తల్లానే ఉన్నారు.ఎందుకంటే పట్టు పంచెతో జయం రవి, పట్టుచీరతో కెనీషా కనిపించడంతో చాలామంది వీరు పెళ్లి చేసుకున్నారు కావచ్చని అనుకుంటున్నారు. అయితే వీరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతోనే తన సోషల్ మీడియా ఖాతాలో సంచలన పోస్ట్ పెట్టింది జయం రవి భార్య ఆర్తి.ఆమె తన పోస్టులో ఈ విధంగా రాస్కొచ్చింది.. సంవత్సరం నుండి నేను ఎంతో బాధని అనుభవించాను. మౌనంగా ఉన్నాను.నా పిల్లల కోసమే నేను ఈ బాధలన్నీ భరించాను. నాపై ఎన్నో క్రూరమైన గుసగుసలు వినిపించాయి. కానీ సైలెంట్ గా ఉన్నాను. అయితే ప్రస్తుతం ఓ ఫోటో చూసాక నిజం చెప్పాలని అనిపిస్తోంది.

అందుకే ఇప్పుడు చెబుతున్నాను. 18 సంవత్సరాలు నాతో కలిసి ఉన్న ఓ వ్యక్తి నాకు దూరం అయ్యారు. దూరం అయ్యాక కూడా తన బాధ్యతలను తీసుకుంటానని మాట ఇచ్చాడు. కానీ ఆ మాటని తప్పాడు. ప్రతి రోజు నేను బాధ అనుభవిస్తున్నాను. చాలా నెలల నుండి ఓ భారాన్ని నా భుజాలపై మోస్తున్నాను. ఒకప్పుడు నాతో కలిసి ఇంటి నిర్మాణం చేపట్టిన వ్యక్తి నన్ను ఇంట్లో నుండి గెంటేశాడు. కానీ నేను డబ్బులకి కాదు మనుషులకు విలువ ఇస్తాను.అందుకే అభం శుభం తెలియని నా పిల్లల కోసం నేను బలంగా నిలబడ్డాను. వారికి చట్టపరమైన నిబంధనలు తెలియవు. ఇంకా తెలియని వయసులోనే ఉన్నారు అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సంచలన పోస్ట్ పెట్టింది ఆర్తి.అయితే ఈ పోస్ట్ ఆర్తి పెట్టడానికి కారణం జయం రవి తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ తో తిరగడమేనని,ఆ ఫోటో చూడడంతోనే ఆర్తి ఈ పోస్ట్ చేసినట్టు అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: