జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న తారక్ "దేవర పార్ట్ 1" మూవీ తో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం తారక్ హిందీ సినిమా అయినటువంటి వార్ 2 మూవీ లో నటిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడిన కూడా ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ ను కూడా మేకర్స్ విడుదల చేయడం లేదు.

ఇక తారక్ బార్ 2 సినిమా షూటింగ్లో పాల్గొంటూనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ మూవీ కి కూడా కమిట్ అయ్యాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ను కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే  కొరటాల శివ "దేవర పార్ట్ 2" సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చాలా రోజుల నుండి బిజీగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా కొరటాల శివ "దేవర పార్ట్ 2" కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను మొత్తం పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఇక మే 20 వ తేదీన తారక్ పుట్టిన రోజు సందర్భంగా దేవర పార్ట్ 2 మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో దేవర 2 కి అధికారిక ప్రకటన వస్తుంది అని చాలా మంది అనుకోలేదు. ఇలా సడన్గా దేవర 2 మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది అని తెలియడంతో తారక్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: