
తారక్ సినిమాస్, వన్మయీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా సలార్ ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా గుర్తింపును సొంతం చేసుకున్న తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందించనున్నారు. ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్, జపనీస్ భాషల్లో సైతం రిలీజ్ కానుంది.
పార్టీ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా ప్రస్తుతం ఫంకీ సినిమాలో నటిస్తున్న విశ్వక్ సేన్ ఒకే సమయంలో రెండు సినిమాలలో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కరాటే రాజు, సందీప్ కాకరాల ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలుస్తోంది. మేక తలను పోలి ఉన్న మాస్క్ ధరించిన విశ్వక్ సేన్ మూవీ పోస్టర్ ఆకట్టుకుంది. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోందని తెలుస్తోంది.
40 మంది కొత్త నటులు ఈ సినిమాలో నటించనున్నారని భోగట్టా. నేడు అల్లు అరవింద్ క్లాప్ కొట్టి ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. అరవింద్ విశ్వనాథన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా యశ్వంత్ మాస్టర్ ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.