జూనియర్ ఎన్టీఆర్ అంటే అభిమానులకి స్పెషల్ రెస్పెక్ట్ . అది ఎందుకో అందరికీ తెలిసిందే . ఆయన సినిమాల కోసం ఏమైనా చేస్తాడు.. ఎంత బిగ్ రిస్క్ పనులైనా చేయడానికి వెనుకాడడు.. మిగతా హీరోలు ఒక్కసారైనా ఆలోచిస్తారేమో కానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఎంతకైనా తెగించేస్తాడు . గతంలో చాలా సినిమాల విషయంలో తెగింపు చూపించారు . ప్రజెంట్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా కోసం పూర్తిగా బరువు తగ్గిపోయాడు చాలా చాలా స్లిమ్ లుక్స్ లో ఆకట్టుకుంటున్నాడు .


తాజాగా ఆర్ఆర్ఆర్ టీం లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో సందడి చేసిన విషయం అందరికీ తెలిసిందే . అక్కడ ఆర్ఆర్ఆర్ లైవ్ మ్యూజిక్ కీరవాణి నిర్వహించారు.  ఇదివరకు అక్కడ బాహుబలి లైవ్ మ్యూజిక్ ఈవెంట్ కూడా నిర్వహించారు . కాగా ఈ వేదికపై రాజమౌళి - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - కీరవాణి బాగా సందడి చేశారు. ఈవెంట్లో హీరోలను కలిసి చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు . కాగా ఎన్టీఆర్ మాత్రం చాలా ఢిఫరెంట్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు . ఆయన లుక్సే ఈ ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పడంలో సందేహమే లేదు .



దీనికి సంబంధించిన ఫోటోలు బాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి . కాగా బ్లాక్ అండ్ సూట్ లో హ్యాండ్సమ్ లుక్స్ లో కనిపించాడు జూనియర్ ఎన్టీఆర్ . చాలా చాలా బరువు తగ్గిపోయాడు.  సోషల్ మీడియాలో ఈయన లుక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం దాదాపు 14 కేజీల బరువు జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం తగ్గాడు అంటూ టాక్ వినిపిస్తుంది.  ఇది నిజంగా చాలా చాలా కష్టమైనదే సినిమా కోసం ఎంత కష్టమైనా భరిస్తాడు అని చెప్పడానికి ఇది మరొక బిగ్ ఎగ్జాంపుల్...!

మరింత సమాచారం తెలుసుకోండి: