టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. రాజమౌళి ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమాను తెరకెక్కిస్తునన్ సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కావడానికి మూడేళ్ల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే స్టార్ డైరెక్టర్ జక్కన్న సినిమా ఇండస్ట్రీని నాశనం చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
రాజమౌళి వల్లే ఇతర స్టార్ డైరెక్టర్లు సైతం మారారని హీరోలు ఒకప్పుడు ఏడాదికి రెండు సినిమాలను రిలీజ్ చేసేవారని ఇప్పుడు రెండు, మూడేళ్లకు ఒక సినిమాను రిలీజ్ చేసే పరిస్థితి నెలకొందని అభిప్రాయాలు నెలకొన్నాయి. రాజమౌళి ఈ కామెంట్ల గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.
 
రాజమౌళి నత్త నడకన సినిమాలను తెరకెక్కించడంతో పాటు ఆ సినిమాల ప్రమోషన్స్ కోసం, రిలీజ్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. తన డైరెక్షన్ లో నటించే హీరోలకు జక్కన్న ఎక్కువ సంఖ్యలో షరతులు విధిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. జక్కన్న తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్నారు.
 
స్టార్ డైరెక్టర్ రాజమౌళి భవిష్యత్తులో బాక్సాఫీస్ వద్ద మరిన్ని అద్భుతాలు సృష్టిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. రాజమౌళి రెమ్యునరేషన్ సైతం ప్రస్తుతం 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటూనే భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఈ దర్శకుడు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నరు. రాజమౌళి రేంజ్ పాన్ వరల్డ్ స్థాయిలో మరింత పెరగాలని పాన్ వరల్డ్ స్థాయిలో ఈ డైరెక్టర్ నంబర్ వన్ కావాలని ఫ్యాన్స్ మనస్పూర్తిగా కోరుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: