
టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి సోషియో ఫాంటసీ సినిమా తర్వాత చిరు ఇప్పుడు విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన క్రేజీ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు నటించే సినిమా కూడా ఇటీవలే ప్రారంభమైంది. ఇటీవల చిరంజీవికి వాల్తేరు వీరయ్య తప్ప సరైన సక్సెస్ లేదు. దీంతో ఇటు విశ్వంభర సినిమా తో పాటు అటు అనిల్ రావిపూడి సినిమా లపై మెగా అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే చిరు నటించిన ఆచార్య ఫ్లాప్ పై చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్లాప్ మూవీస్ ని ఎలా తీసుకుంటారు ? ఆచార్య లాంటి సినిమా నిరాశ పరిచినప్పుడు ఎలా ఫీలయ్యారని యాంకర్ ప్రశ్నిస్తే దీనికి చిరు ఇంట్రస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. తాను కెరీర్ స్టార్టింగ్ లో సక్సెస్ వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాడిని అని.. ఆ తర్వాత ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కుంగిపోయానని .. ఇది కెరీర్ బిగినింగ్ లో మాత్రమే అని.. తర్వాత ఎన్ని ప్లాపులు వచ్చినా అవేవి నా కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపలేదన్నారు.
ఇక ఆచార్య విషయంలో అది దర్శకుడు ఛాయిస్ .. అతడు చెప్పిందల్లా మేము చేసాం. కానీ ఆచార్య చిత్రంలో చిన్న నిరాశ ఏంటంటే.. నేను చరణ్ కలిసి నటించిన తొలి సినిమా ఇలా ప్లాప్ కావడం బాధేసిందన్నారు. ఏదేమైనా ఆచార్య విషయం లో చిరు ప్రతిసారి పరోక్షంగా దర్శకుడు కొరటాల ను కార్నర్ చేసేలా మాట్లాడుతున్నారన్న కామెంట్లు అయితే ఇండస్ట్రీలో ఉన్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు