
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పా 2 సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేశాడు .. ఇండియన్ సినిమా హిస్టరీలోనే గత సినిమాల తాలూకు రికార్డులను తిరగరాస్తు ఇండియన్ హిస్టరీలోనే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది .. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలపై భారీ అంచనాలు పెరిగిపోయాయి .. ఈ క్రమంలోని కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .. బన్నీ కెరీర్ లోని 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమా పై ఎప్పటినుంచో అంచనాలు ఊహించని రేంజ్ లో ఉన్నాయి .. కోలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ప్రొడక్షన్స్ లో ఒకటైన సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుంది ..
ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా వర్క్ చేయనున్నారు .. ఇక ఇప్పుడు ఈ సినిమా కు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది .. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా AA22 సినిమాను 2027 సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట .. ఈ సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుందట ఆ తర్వాత సీజీ వర్క్ కారణంగా ఏడాది పోడువున షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట .. అలాగే రాబోయే ఆరు నెలలు ప్రీ ప్రొడక్షన్ పనులను ఫినిష్ చేసేలా భారీ ప్లాను రెడీ చేస్తుందట చిత్ర యూనిట్ .. అలాగే అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమాలోని న్యూ లుక్ కోసం తన మేకోవర్ మార్చుకునేందుకు కఠినమైన శిక్షణలో పాల్గొంటున్నారు .. అలాగే అట్లీ కెరీర్ లోనే 6వ సినిమాగా వస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్టులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారని టాక్ కూడా వినిపిస్తుంది ..