
మైత్రీ బ్యానర్ లో డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ తో విజయ్ ఓ మూవీకి కమిట్ అయ్యాడు. `వీడీ14` వర్కింగ్ టైటిల్ తో ఇటీవల ఈ సినిమాను అనౌన్స్ చేశాడు. ఇలా చేతి నిండా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. అమ్మ అడిగిన కోరికను కాదనకుండా నెరవేర్చాడు విజయ్. కుదిరితే మనమంతా డిన్నర్ కి వెళదామా అని తల్లి కోరడంతో.. విజయ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తల్లిదండ్రులతో పాటు తమ్ముడి ఆనంద్ తో కలిసి డిన్నర్ కి వెళ్లాడు. ఫ్యామిలీతో సరదాగా టైమ్ స్పెండ్ చేశాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ షేర్ చేసి వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. డిన్నర్ నుంచి తిరిగి వస్తుండంగా కారులో విజయ్ సింగర్ గా మారిపోవడం వీడియోలో మనం గమనించవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన `అజ్ఞాతవాసి` సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ `గాలి వాలుగా` కారులో ప్లే అవుతుండడంతో విజయ్ కూడా తన గొంతు కలిపాడు. మంచి వాయిస్‌తో లిరిక్స్ ను అద్భుతంగా పాడాడు. ఈ వీడియో ప్రస్తుతం పవర్ స్టార్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది.